కోట్ల డబ్బున్నా పూర్తి నగ్నంగా తిరుగుతున్న జంట.. - MicTv.in - Telugu News
mictv telugu

కోట్ల డబ్బున్నా పూర్తి నగ్నంగా తిరుగుతున్న జంట..

October 12, 2020

 Belgium couple world wandering

‘పుట్టకతో దేన్నీ వెంటబెట్టుకుని రాం. పొయ్యేటప్పుడూ దేన్నీ తీసుకెళ్లం. మధ్యలో నాదీ, నాదీ అనే రంధి ఎందుకు?’ అని కొందరు మెట్టవేదాంతం చెప్తారు. మరికొందరు సింపుగా ‘లోకంలో ఏది శాశ్వతం’ అని తరచూ శ్మశాన వైరాగ్యం వల్లిస్తుంటారు. ఎవరో ఏదో చెప్పారని, ఏదీ శాశ్వతం కాదని.. అన్నీ విప్పుకు తిరగలేం కదా. 

విషయంలోకి వస్తే.. కోట్ల ఆస్తులున్న ఓ జంట ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా దేశాలు పట్టుకు తిరుగుతోంది. అంతటితో ఆగకుండా ఆ మహత్తర భంగిమలను ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పడేస్తోంది. ‘వీళ్లకేం పొయ్యే కాలం..’ అని నోరునొక్కుకోవాల్సిన అవసరం లేదు. అటు పబ్లిసిటీ, ఇటు డబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టే వాళ్లలా బరితెగించి తిరుగుతున్నారు.

 బెల్జియంకి చెందిన నిక్ లన్స్ కార్టేల వింత కథ ఇది. పన్నెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న వీరికి బట్టల్లేకుండా ప్రపంచాన్ని చుట్టిరావాలన్నది వీళ్ల కోరికట. ప్రయాణాల్లో, హోటళ్లలో, తిండీతిప్పల్లో తప్పిస్తే మిగతా అన్ని సమయాల్లో బిత్తలగానే తిరుగుతుంటారు. నేకెడ్ వాండరింగ్ పేరుతో హల్ చల్ చేస్తున్న వీరికి సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది. అయితే ఎంతైనా మనిషి కనుక ఎక్కడో సిగ్గు ఉంటే ఉంటుంది కనుక ప్రైవేట్ పార్ట్స్‌ ఎక్స్‌పోజ్ కాకుండా ఫొటోలు తీసుకోవడం వీరి స్పెషల్. పుర్రెకో బుద్ధి!