‘అల్లుడు శీను’పై నెటిజన్లు ఫైర్.. ఎందుకో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

‘అల్లుడు శీను’పై నెటిజన్లు ఫైర్.. ఎందుకో తెలుసా?

September 25, 2018

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టి భారీ చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేసిన శ్రీనివాస్‌కు భారీ హిట్‌ను మాత్రం సొంత చేసుకోలేకపోయాడు. మొదటి సినిమా అల్లుడు శీను సినిమా, ఆ తర్వాత వచ్చిన జయ జానకి నాయక సినిమాలు పర్వలేదు అనిపించినా.. మిగతా రెండు సినిమాలు డిజాస్టర్‌గా నిలిచిపోయాయి. దీంతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.Bellamkonda Sreenivas Trolled ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ థాయ్‌లాండ్ జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీనివాస్ చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదమైంది. షూటింగ్ సమయంలో శ్రీనివాస్ ఏనుగు దంతాలపై కూర్చొని దిగిన ఓ ఫోటో తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు బెల్లంకొండపై ఫైర్ అవుతున్నారు.

మూగజీవిపై కూర్చొని ఫోటో దిగటం జీవహింస అంటూ మండిపడ్డారు. దీంతో శ్రీనివాస్ ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాడు.