త్వరలో బెల్లంకొండ పెళ్లి.. సురేశ్ వెల్లడి - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో బెల్లంకొండ పెళ్లి.. సురేశ్ వెల్లడి

August 13, 2019

Bellamkonda Srinivas.

టాలీవుడ్‌లో మరో యువ హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ‘రాక్షసుడు’ సినిమాతో సక్సెస్‌గా దూసుకెళ్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని బెల్లంకొండ సురేష్ వెల్లడించారు.‘రాక్షసుడు’ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా తమ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయని తెలిపారు. 

ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఉన్న బెల్లంకొండ ఫ్యామిలి సినిమాలతో సంబంధంలేని ఫ్యామిలీ అమ్మాయితో శ్రీనివాస్ పెళ్లి జరిపించబోతోందట. ఇప్పటికే పెళ్లి సంబంధాలు చూస్తున్నామని తొందరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెప్పారు. మరోవైపు శ్రీనివాస్‌తో కమర్షియల్ సినిమా తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని తెలిపారు. తమిళ ‘రాచ్చసన్’ తెలుగు రిమేక్‌గా వచ్చిన రాక్షసుడు తెలుగులో భారీగా వసూళ్లు రాబట్టిందని వెల్లడించారు సురేష్. తాజాా ప్రకటనతో శ్రీనివాస్‌కు సరిజోడు ఎవరనే అంశంపై టాలీవుడ్‌లో చర్చసాగుతోంది.