మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మునిసిపల్ కమిషనర్ గంగాధర్‌పై ఆ శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిని సస్పెండ్ చేయమని అధికారులను ఆదేశించారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలకు హాజరుకాని నలుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాక, ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా విమర్శించడంతో అప్రమత్తమైన కేటీఆర్ సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఇలాంటి వాటిని ప్రోత్సహించడంలో తానెప్పుడూ చివరన ఉంటానని స్పష్టం చేశారు. అటు టీఆర్ఎస్ రాజకీయ నాయకత్వం కూడా ఈ విషయంలో అసంతృప్తికి లోనయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రే స్వయంగా తన పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని చెప్పినా ఇలా చేయడమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.