గాలి ఆప్తుడికి బంపర్ ఆఫర్.. ట్రంప్ ఆహ్వానం - MicTv.in - Telugu News
mictv telugu

గాలి ఆప్తుడికి బంపర్ ఆఫర్.. ట్రంప్ ఆహ్వానం

February 3, 2018

అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకెళ్లి, కూతురికి వందల కోట్ల రూపాయలతో ఘనంగా పెళ్లిచేసిన సెలబ్రిటీగా మారిపోయిన గాలి జనార్దన్ రెడ్డి పవర్ ఏమిటో మనకు తెలిసిందే. ఆయన కుడిభుజమైన బళ్లారి ఎంపీ బి. శ్రీరాములు కూడా తక్కువ కాదు. ఆయనకు కూడా చాలా వ్యాపారాలున్నాయి. ఈ సంగతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు తెలిసినట్లుంది. ఒక ప్రతిష్టాత్మకమైన విందుకు శ్రీరాములును సాదరంగా ఆహ్వానించారు. భారత్ నుంచి ఈ విందుకు వెళ్తున్నవారి ఇద్దరిలో శ్రీరాములు ఒకరు కాగా, మరొకరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.

అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన వారు 130 దేశాల నుంచి ప్రముఖులను పిలిచి వైట్ హౌస్ లో విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కాస్త ఆలస్యంగా ట్రంప్ ఇస్తున్నాడు. ఈ నెల 7, 8 తేదీల్లో సాగే ఈ విందుకు తనను పిలవడంపై బళ్లారి బీజేపీ ఎంపీ ఉబ్బతబ్బిబ్బవుతున్నాడు. ఇది జీవితంలో మరచిపోని అనుభూతి అని అన్నాడు.