సాధారణంగా శ్రద్ధాంజలి సభ అంటే అందరూ విచారంగా ఉంటారు. చనిపోయిన వారిని స్మరించుకొని వారి గురించి చర్చించుకుంటారు. అంతేకాక, బంధుమిత్రులు, పరిచయస్తులు ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటారు. కానీ, మనం చూసే వీడియోలో మాత్రం అలా లేదు. వెనుక పోస్టర్లో ఓ ముసలాయన జంట ఫోటో ఉంది. చూస్తే వీరి గురించే శ్రద్ధాంజలి సభ పెట్టారని ఇట్టే కనిపెట్టేయవచ్చు. అంతేకాక హిందీలో శ్రద్ధాంజలి అని క్లియర్గా రాసి ఉంది. వేదికకు ఎదురుగా వచ్చిన అతిథులు, బంధుమిత్రులు విచారంలో మునిగి ఉన్నారు. ఇంతలో వేదికపై ఓ యువతి వచ్చి సల్మాన్ ఖాన్ పాటకు బెల్లీ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఇదే దరిద్రం అనుకుంటే.. అక్కడకు వచ్చిన వారు ఇదేంటని వారించకపోవడం మరో దరిద్రం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram