ప్లే ఆఫ్స్ కు బెన్ స్టోక్స్ దూరం - MicTv.in - Telugu News
mictv telugu

ప్లే ఆఫ్స్ కు బెన్ స్టోక్స్ దూరం

May 15, 2017

ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. జట్టులో కీలక ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని ఆ జట్టు సారథి స్మిత్‌ ప్రకటించాడు. ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన పుణె క్వాలిఫయర్‌-1లో మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో పోరాడనుంది.
టోర్నీలో భాగంగా ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 9వికెట్ల తేడాతో గెలిచి పుణె పాయింట్ల పట్టికలో రెండో స్థానం స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. “ప్లేఆఫ్స్‌కి స్టోక్స్‌ సేవలు కోల్పోవడం చాలా దురదృష్టకరం, అతని లేని లోటు తీర్చలేనిది. జట్టు చాలా విలువైన ఆటగాడి సేవలు కోల్పోయింది. జట్టులోని మిగతా ఆటగాళ్ల ద్వారా స్టోక్స్‌లేని లోటును భర్తీ చేయగలమని”‘స్మిత్ చెప్పాడు.
టోర్నీలో మొత్తం 12మ్యాచ్‌లాడిన స్టోక్స్‌ 316 పరుగులు చేసి 12 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డుతో చేసుకున్న ఒప్పందం మేరకు స్టోక్స్‌ ఐపీఎల్‌ను వీడుతున్నట్లు సమాచారం.

HACK:

Rrising Pune Supergiants tea captain Smith declared that player Ben Stoke will not be available for playoffs in IPL match.