ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుది ప్రత్యేక స్థానం.మొత్తం నాలుగు సార్లు ట్రోఫీని దక్కించకుంది. ఆ టీమ్ కెప్టెన్ ధోని జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు.ఈ సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌తో ధోని లీగ్‌కు దూరం కావొచ్చనే వార్తలు వస్తున్నాయి. దీంతో చెన్నైకు కొత్త నాయకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి గత ఏడాదిలోనే ధోని సారథ్య బాధ్యతలనుంచి తప్పుకోవడంతో.. రవీంద్ర జడేజాను కెప్టెన్ గా నియమించారు. అయితే అతని నాయకత్వంలో జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో తిరిగి ధోనియే పగ్గాలు అందుకున్నాడు.
తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో చెన్నై స్టోక్స్‌ను దక్కించుకుంది. అతడిని రూ.16.25కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో ధోని వారసుడిగా స్టోక్స్ కొనసాగుతాడని వార్తలు వస్తున్నాయి. సీఎస్కే కొత్త కెప్టెన్ అతడే అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు వహిస్తున్న స్టోక్స్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పాలని జట్టు యాజమాన్యం కూడా చూస్తుందంట. స్టోక్స్‌ను కొనుగోలు చేయడం పట్ల ఎంఎస్ ధోని..సంతోషంగా ఉన్నాడని ఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ చెప్పడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.