benefits of walking
mictv telugu

ఇవి బలంగా ఉంటే మనం బాగున్నట్టే

January 6, 2023

benefits of walking

రోజూ కాసేపు నడవండి….డాక్టర్ల నుంచి డైటీషియన్ల వరకూ అందరూ చెప్పే మాట. మనం వినం అనుకోండి. అబ్బ ఇవాళ బద్దకంగా ఉంది…. అయ్యో కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి అంటూ వాయిదాలు వేస్తాం. నడిస్తే ఎంత, నడవకపోతే ఎంత అంటూ కొట్టిపారేస్తాం. కానీ మనం గుర్తించన విషయం ఏంటంటే మన ఆరోగ్యం అంతా మన కాళ్ళల్లోనే ఉంది. మనం ఎంత నడిస్తే అంత మంచిది. అన్ని ఎక్సర్సైజ్ లో కన్నా నడక చాలా తేలిక. అన్నిటికన్నా బెనిఫిట్స్ కూడా దీనికే ఎక్కువ. ఎలాంటి వ్యాయామమైనా ఆరోగ్యాన్ని పెంపొందించేదే కానీ నడకతో ప్రత్యేకంగా లభించే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

హార్వర్డ్ యూనివర్శిటీ రిసెర్చ్ ప్రకారం బరువు పెరగడానికి మన శరీరంలో ఏవైతో జన్యువులు ప్రభావిం చూపిస్తాయో నడక వాటిని తిప్పికొడుతుంది. సుమారు 32 జన్యువుల మీద చేసిన ప్రయోగంలో ఇది తేలింది. రోజుకు గంట వాకింగ్ చేసేవారిలో వీటి ప్రభావం సగానికి పైగా తగ్గిందట.

బరువు పెరగడానికి ముఖ్య కారణాల్లో ఒకటి తీపి పదార్ధాలు. చాలా మందికి స్వీట్ టూత్ ఉంటుంది. అది కూడా ఎక్కువగా. దీనివలన బరువు పరెగుతారు. డయాబెటీస్ ఉన్నవాళ్ళకు అయితే సుగర్ లెవెల్సూ పెరుగుతాయి. అయితే రోజూ నడిచే వారిలో ఈ కోరిక బాగా తగ్గుతుందిట. 15 నిమిషాలు నడిచినా చాలు చాక్లెట్ తినాలనే కోరిక తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ టర్ యూనివర్శిటీ వాళ్ళు గుర్తించారు.

ఎలాంటి శారీరక శ్రమ అయినా రొమ్ము క్యాన్సర్ తగ్గడానికి ఉపయోగడుతుంది. ఒక్క నడకతోనూ ఇది సాధ్యమే అంటున్నారు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధకులు. వారానికి 7 గంటలు అంతకన్నా ఎక్కువ నడిచిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు 17శాతం వరకూ తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అధిక బరువు కూడా రొమ్ము క్యాన్సర్ కు కారణం అవుతుంది.

కీళ్ళవాపు వల్ల వచ్చే నొప్పులు తగ్గడానికి నడక సహాయం చేస్తుంది. అసలు ఆ సమస్యే రాకుండా కూడా నడక కాపాడుతుందిట కూడా. వారానికి 5 లేక 6 కిలోమీటర్లు నడక కీళ్ళవాపు నివారణకు తోడ్పడినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. నడవటం వలన అరిగిపోయే ప్రమాదం ఉన్న మోకీళ్ళు, తుంటి కీళ్ళు, వాటి చుట్టూ ఉండే కండరాలు బలోపేతం అవుతాయి. కీళ్ళు ఒరుసుకుపోవడం తగ్గి, కదలికలు సాఫీగా సాగుతాయి. ఇవి కీళ్ళ నొప్పులు రాకుండా చేస్తాయి.

నడకతో రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. వారానికి ఒకసారి అంతకన్నా తక్కువ వ్యాయామం చేసిన వారితో పోలిస్తే…రోజుకు కనీసం నిమిషాల సేపు నడిచిన వారికి జలుబు, ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్లు రావడం తగ్గిస్తున్నాయిట. ఒకవేళ వచ్చిన వాటి లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.