గ్రీన్ టీ…ఇది అందరికే తెలిసిందే. పల్లెటూర్లలో కూడా దీని గురించి బాగా తెలిసిపోయింది. అయితే చాలా మందికి తెలియనది ఏంటంటే కాఫీల్లో కూడా గ్రీన్ కాఫీ ఉందని. దాన్ని కూడా తాగొచ్చని….అది కూడా మన శరీరానికి చాలా మేలు చేస్తుందని.మనం రోజూ తాగే కాఫీపొడి, వేయించిన గింజల నుంచి తీస్తారు. వేయించకుండా పచ్చిగా ఉన్న గింజలతో చేస్తే కాఫీనే గ్రీన్ కాఫీ అంటారు. కాఫీ గింజలను వేయించినప్పుడు కొన్ని ఔషధ గుణాలను కోల్పోతాము. అలా కాకుండా గ్రీన్ కాఫీ తాగితే అనేక ఔషధ గుణాలు శరీరానికి అందుతాయి. ఆ గుణాలేంటో చూద్దాం…
గ్రీన్ కాఫీ శరీరంలోని కొవ్వుని కరిగించి అధిక బరువును తగ్గిస్తుంది.
వివిధ కారణాలతో శరీరంలో అంతర్గతంగా జరిగే నష్టాన్ని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నివారిస్తాయి.
మధుమేహన్ని, రక్తపోటును నియంత్రిస్తుంది.
జీవక్రియలను మెరుగు పరిచి బరువును నియంత్రణలో ఉంచుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందడం వల్ల వయసు ప్రభావంతో చర్మం ఏర్పడే ముడతలు త్వరగా రావు.