రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా మార్కెట్లోకి కొత్త బైక్ - MicTv.in - Telugu News
mictv telugu

రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా మార్కెట్లోకి కొత్త బైక్

October 22, 2019

Benelli Imperiale 400 Launched In Indian

హుందాగా బైక్‌పై దూసుకెళ్లాలని అనుకునేవారు చాలా మంది రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లను వాడుతుంటారు. కానీ ఇప్పుడు దానికి పోటీగా మరో బైక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటలీకి చెందిన బెనెల్లి నుంచి ఇంపీరియల్ – 400 మోడల్ బైక్ విడుదల చేశారు. అదిరిపోయే లుక్‌తో సరికొత్త ఫీచర్లతో యూత్‌ను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించారు. నలుపు, వెండీ, ఎరుపు రంగుల్లో ఈ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. 

370 ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ బైక్‌ను బీఎస్4 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. 19,18 అంగుళాల టైర్లు, స్టీల్ డబుల్ క్రాడిల్ ఫ్రేంలను అమర్చారు. సింగిల్ సిలిండర్, 5 స్పీడ్ గేర్ బాక్స్,29 ఎన్‌ఎం పీక్‌ టార్‌క్యూ ఎఫ్‌ ఇంజిన్‌ దీంట్లో ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.69 లక్షలుగా నిర్ణయించారు. బెనెల్లి సంస్థ అధికారిక వెబ్‌సైట్లో బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. ప్రీబుకింగ్ సమయంలో రూ.4000 చెల్లించాల్సిందిగా షరతులు పెట్టారు. ఈ బైక్‌పై మూడేళ్ల పాటు వారెంటీ కూడా ఇవ్వనున్నారు.