Bengal Governor Shock To BJP Leaders
mictv telugu

గవర్నర్ రివర్స్ గేర్..బీజేపీ నేతలకు షాక్…

November 16, 2022

ఆ గవర్నర్ రూటే సెపరేట్. అందరూ గవర్నర్లు ముఖ్యమంత్రుల్ని ఇరుకన పెడుతుంటారు. కేరళ,తమిళనాడు, తెలంగాణలో ఇదే జరుగుతోంది.కానీ బెంగాల్‌లో మాత్రం సీన్ రివర్స్. గవర్నర్ లా గణేశన్ అయ్యర్ అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కాకుండా ఆ రాష్ట్ర బీజేపీకి షాక్ ఇస్తున్నారు. దీదీ సర్కార్‌తో సఖ్యతగా ఉంటూ బీజేపీ నేతలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు.ఇది తట్టుకోలేక పోతున్న బీజేపీ…గవర్నర్ పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసింది.

నో అపాయింట్‌మెంట్స్

తమిళనాడుకు చెందిన లా గణేశన్ అయ్యర్ మణిపాల్ గవర్నర్. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఉపరాష్ట్రపతిగా వెళ్లారు. దీంతో బెంగాల్ గవర్నర్‌గా గణేశన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇంతకు ముందు గవర్నర్‌లా కాదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సఖ్యతగా ఉంటున్నారు. ప్రభుత్వంతో సన్నిహితంగా మెదులుతున్నారు. గవర్నర్ సోదరుడి బర్త్ డే చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి మమతా బెనర్జీ వెళ్లారు. ఈ సమయంలోనే రాజ్ భవన్‌కు బెంగాల్ బీజేపీ నేతలు వచ్చారు. గవర్నర్ చెన్నైలో ఉన్నారన్న సమాచారం వారికి తెలియదు. ఇక అంతే బీజేపీ నేతలు గవరన్న లా గణేశన్ అయ్యర్ పై ఫైర్ అయ్యారు. రాష్రపతి ద్రౌపది ముర్మ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అఖిల్ గిరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం సీఎం మమతాబెనర్జీకి సిఫార్సు చేయాలని గవర్నర్‌ని కోరేందుకు వారు వచ్చారు. రాజ్‌భవన్ ఆయన లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.

షాక్ మీద షాక్

మంగళవారం ర్యాలీగా వెళ్లినా గవర్నర్ కలువలేదు. అంతకుముందు రోజు ఇలాగే జరిగింది. ఈ పరిణామం బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారికి కోపం తెప్పించింది. రాజ్‌భవన్‌కు అభ్యర్థన చేయడానికి రాలేదని, గట్టి డిమాండ్‌తోనే వచ్చామని సువేందు అధికారి అన్నారు. మంత్రి వ్యాఖ్యలు చేసి 72 గంటలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మంగళవారం తాము రాజ్‌భవన్‌కు మెయిల్ చేశామని, గవర్నర్ ఎక్కడ ఉన్నా చర్యలు తీసుకునే రాజ్యాంగ హక్కు ఆయనకుందన్నారు. ఇంతకుముందు గవర్నర్‌గా ఉన్న జగదీఫ్ ధన్‌కర్ తాము వస్తే ఆయన మమ్ముల్ని బాగా రిసీవ్ చేసుకునేవారని బీజేపీ నేత అగ్రిమిత్ర పాల్ అన్నారు. ఆయన లేని లోటు ఇప్పుడు తెలుస్తుందన్నారు.

దీదీ కౌంటర్

సువేందు అధికారి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి కనెక్షన్లు లేకపోతే ఆయన జీరో అని విమర్శించారు. ఢిల్లీని నుంచి ఉన్న రాజకీయ పలుకుబడిని ప్రదర్శించేందుకే ప్రతిపక్షనేత సువేందు అధికారి ప్రయత్నిస్తున్నారన్నారు. రేపు ఢిల్లీలో అధికారంపోతే ఆయన ఏమైపోతారోనని మమత కామెంట్ చేశారు.

కేంద్రానికి కంప్లయింట్

నిజానికి జగదీప్ ధన్‌కర్ గవర్నర్‌గా ఉన్నప్పుడు సీఎం మమత బెనర్జీకి చుక్కలు చూపించారు. పరిపాలన నిర్ణయాలపై జోక్యం చేసుకునేవారు. విపక్ష బీజేపీ నేతలకు ఎప్పుడూ అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు. దీదీ సర్కార్‌కు ట్రబుల్ మేకర్‌గా తయారయ్యారు. ఆయన ఉపరాష్ట్రపతిగా వెళ్లాక లా గణేశన్ అయ్యర్ వచ్చారు. ఈయన బెంగాల్ బీజేపీ నేతల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో విపక్షనేత సువేందు రగిలిపోతున్నారు. గవర్నర్ గణేశన్ ని రీకాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు.