ముఖ్యమంత్రిని చంపితే 65 లక్షలు! - MicTv.in - Telugu News
mictv telugu

ముఖ్యమంత్రిని చంపితే 65 లక్షలు!

October 18, 2017

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి  మమతా బెనర్జీని చంపడానికి  వాట్సప్‌లో బేరం కుదుర్చుకోవాలనుకున్నాడు ఓ ఉగ్రవాది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల విద్యార్థికి ఓ వాట్సప్ మెసేజ్ వచ్చింది. అందులో ఏముందంటే. .‘పశ్చిమ బెంగాల్ సియం మమతా బెనర్జీని హత్య చేస్తే మీకు 65 లక్షలు ఇస్తాం, మీకెలాంటి ప్రమాదమూ ఉండదు, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు,మాతో చేతులు కలపండి, లేకుంటే వేరొకరిని ఎంపిక చేసుకుంటాం’ అని విద్యార్థి తొందర పెట్టారు. వాట్సప్ మెసేజ్ పంపిన వ్యక్తి తనను తాను ఓ ఉగ్రవాదిగా పరిచయం చేసుకున్నాడు. దీనితో సదరు విద్యార్థి ఈమెసేజ్‌పై పోలీసులకు సమాచారం అందించాడు.

ఈ మెసేజ్ ఆధారంగా  పశ్చిమ బెంగాల్‌ సీఐడీ దర్యాప్తు జరుపుతోంది. ఇది ఎవరైనా కావాలని మెసేజ్ పెట్టారా ? లేక నిజంగా ఉగ్రవాదుల పనేనా అనే దానిమీద పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.