ఏంటీ విషాదాలు.. 24ఏళ్ళ యంగ్ హీరోయిన్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఏంటీ విషాదాలు.. 24ఏళ్ళ యంగ్ హీరోయిన్ మృతి

November 20, 2022

24 ఏళ్ల నటి ఐంద్రీలా శర్మ ఆదివారం కన్నుమూశారు. గత రాత్రి ఈ నటికి పలుమార్లు గుండెపోటు రావడంతో ఆమెకు CPR అందించి రక్షించినా.. మరోసారి గుండెపోటు వచ్చింది. కానీ ఈసారి, ఆమె CPRకి కూడా స్పందించలేదు. ఆ తరువాత పరిస్థితి విషమించడంతో నటి మధ్యాహ్నం 12.59 గంటలకు తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఐంద్రీలా శర్మని హౌరాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్టుపై ఉంచినా ఫలితం లేకపోయింది. ఇక ఈ నటి ఇప్పటికే రెండు సార్లు క్యాన్సర్ భారిన పడగా.. విజయవంతంగా ఆమె వ్యాధిని జయించింది. శరీరం నుండి క్యాన్సర్ కణాలు పూర్తిగా పోవటంతో తిరిగి నటించటం కూడా మొదలుపెట్టింది ఐంద్రీలా శర్మ. ఈ సందర్భంలో విధి మరోసారి ఆమెపై పగపట్టింది.

నవంబర్ 1న భారీ బ్రెయిన్ స్ట్రోక్‌ రావటంతో ఆసుపత్రిలో చేరిన నటికి మెదడులో తీవ్రమైన రక్తస్రావం జరిగింది. బెంగాలీ టీవీ నటిగా ఐంద్రిలా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. బెంగాలీ టీవీ షో ‘ఝుమూర్’, ‘జియోన్ కతి’, ‘జిబోన్ జ్యోతి’ వంటి ప్రముఖ సీరియల్స్ లో నటించింది. ఇక ఐంద్రీలా శర్మ ఓటీటీలో ‘భాగర్’ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలతో నటనకి గ్యాప్ తీసుకుంది. ట్రీట్మెంట్ సజావుగా సాగుతుండగానే ఆమె మరణించిందని పలు రూమర్స్ కూడా వచ్చేవి. అయితే డాక్టర్లు ఎంత ప్రయత్నించినా నటి ఐంద్రీలా శర్మ ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇక కేవలం 24ఏళ్ళ వయసులో ఎంతో భవిష్యత్తు ఉన్న నటి ఐంద్రీలా మృతిపై బాలీవడో టు టాలీవుడ్ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.