పోలీసులు, కోర్టు, జైలు..ఇవేవీ దారుణాలను ఆపలేకపోతున్నాయి. ఘోరం జరిగాక నిందితులకు పట్టుకోవడం తప్పా..తప్పు చేయాలంటే భయపడే పరిస్థితులని మాత్రం కలిపించడం లేదు. ఇందుకు ఎటువంటి జంకు లేకుండా హత్యలు చేయడమే ఉదాహరణ. మైనర్ల స్థాయి నుంచే క్రైం బాట పడుతున్నారు. ప్రధానంగా మహిళలపై దాడులకు అడ్డుకట్టపడడం లేదు. ప్రేమించలేదని ఒకరు, పెళ్ళికి నిరాకరించిందని మరొకరు కిరాకతకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ రోజు ఏదో ఒక దగ్గర ఇలాంటి ఘటనలే కనిపిస్తున్నాయి. తాజాగా బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి గొంతు నులిమి చంపేశాడు ప్రియుడు. అనంతరం అతడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే హత్యకు ముందు ఇద్దరు సెక్స్‌లో పాల్గొన్నట్లు పోస్టుమార్టం పరీక్షలో తేలింది.
కేపీ అగ్రహారకు చెందిన యువకుడు మనోజ్..యువతి శాలిని ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇంతలో యువతి శాలినికి వేరే అబ్బాయింతో ఇంట్లో వాళ్లు వివాహం నిశ్చయించారు. ఆమె కూడా పెళ్లికి సిద్ధమైంది. దీనిపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. మంగళవారం శాలిని ఇంటికి మనోజ్ వచ్చాడు. మరోసారి ఇద్దరు పెళ్లి విషయంపై గొడవకు దిగారు. ఈ క్రమంలో అతడు ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి తన ఇంటికి వెల్లిపోయి ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం మనోజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
యువతి శాలిని మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ పోస్టుమార్టం నివేదికలో విస్తుపోయే నిజం బయటపడింది. హత్యకు ముందు ఇద్దరు సెక్స్‌లో పాల్గొన్నట్లు తేలింది. సెక్స్‌లో పాల్గొన్నాక మనోజ్ యువతిని హత్య చేసినట్లు వైద్యులు నిర్ధారించారు.