Bengaluru bride Stuck in Heavy Traffic takes Metro to reach Wedding Hall just before her marriage
mictv telugu

ట్రాఫిక్‌లో చిక్కుకున్న పెళ్లికూతురు ఏం చేసిందంటే..

January 19, 2023

Bengaluru bride Stuck in Heavy Traffic takes Metro to reach Wedding Hall just before her marriage

పెళ్లి మూహూర్తానికి పెళ్లి జరగడం అంత సులభమేం కాదు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత ఊరికే పుట్టలేదు. అన్నీ సిద్ధంగా ఉన్నా ముహూర్తం వేళకు ఏదో ఒక అడ్డంకి ఎదురుకావొచ్చు. కట్నకానుకల గొడవలు, ప్రియుడో, ప్రియురాలో మధ్యలో రంగప్రవేశం చేసి చెడగొడ్డడం వంటివి ఇటీవల మామూలవుతున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ వధువుకు ఇలాంటి సమస్యలేవీ ఎదురుకాలేదుగాని అంతకంటే భీకరమైన ట్రాఫిక్ సమస్య ఎదురైంది.

కల్యాణమంటపానికి కారులో బయల్దేరిన ఆమె ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ముహూర్తానికి పెళ్లిమంటపానికి చేరుకుంటానో లేదోనని తెగ కంగారుపడింది. బుర్రకు పదునుపెట్టింది. షార్ప్ అవిడియా తట్టేసింది. వెంటనే కారు దిగేసి పెళ్లివాళ్లతో కలిసి మెట్రో ఎక్కసింది. అనుకున్న ముహూర్తానికి మూడుమూళ్లూ వేయించుకుంది. పెళ్లికూతురి అలంకరణతో మెట్రో ప్రయాణం చేస్తున్న ఈ ఇంటెలిజెంట్ వధువు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్, పండగ సీజన్ కావడంతో బెంగళూరు రోడ్లు వాహనాలతో కిక్కిరిపోవడం వల్ల ఆమెకు చిక్కొచ్చిపడిందన్నమాట. రోడ్డు మార్గం వెళ్తే మూహూర్తం దాటిపోతుందని మెట్రో ఆప్షన్ ఎంచుకుంది. కొందరు వాట్ యాన్ ఐడియా తల్లీ అని పొగుడుతుంటే కొందరు ఇదంతా అతి అని విసుక్కుంటున్నారు. పెళ్లికి ముందే బయల్దేరాలి కదా, మరీ అంత బిజీ ఏంటమ్మా అని ప్రశ్నిస్తున్నారు.