ఎన్నెన్నో జన్మల బంధం.. ఈ పొట్టివాళ్ల ప్రేమ ఎంతో గట్టిది! - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నెన్నో జన్మల బంధం.. ఈ పొట్టివాళ్ల ప్రేమ ఎంతో గట్టిది!

December 23, 2020

VDFVFT

పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయమవుతాయని పెద్దలు అంటారు. అందులో ఎంత నిజముందో తెలియదు కాని కొందరి పెళ్లిళ్లును చూస్తే.. ఎన్నెన్ని జన్మల సంబంధమో అనిపిస్తుంది. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు వింతగా అనిపిస్తుంది. అలాంటి అరుదైన దంపతుల కథ ఇది. 

బెంగళూరుకు చెందిన బైరప్ప, రూప మరుగుజ్జులు. పట్టుమని మూడు అడుగుల ఎత్తు కూడా లేరు. దాదాపు ముప్ప ఏళ్ల వయసున్న వీరు జీవితంలో ఎదుర్కోని అనుమానాలు లేవు. తల్లిదండ్రులే విసుక్కునే వారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక పెళ్లి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. 

కొప్పల్‌కు భైరప్ప ఉద్యోగం 70 ఇంటర్వ్యూల తర్వాత మిట్టీ కేఫ్ అనే ఎన్జీవో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతని కోసమే వచ్చిందేమో అన్నట్లు రూప కూడ అదే కేఫ్‌లో ఉద్యోగంలో చేరింది. తొలి చూపులోనే ప్రేమ మొలుకెత్తింది. సిగ్గులు మొగ్గతొడిగి వలపు వికసించింది. యాజమాన్యం అండతో ఇద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే భైరప్ప తండ్రి అడ్డుపుల్ల వేశాడు. రూప తల్లిదండ్రులు కట్నమిస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానన్నాడు. భైరప్ప తిరగబడ్డాడు. కట్నం లేకుండానే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌లో ఇద్దరూ కన్నులపండుగగా పెళ్లి చేసుకున్నాడు. స్టెప్పులేసి మరీ దుమ్మురేగ్గొట్టారు. కొత్త జంటను అందరూ నిండు మనస్సుతో ఆశీర్వదించారు.