పెట్రోల్ పోయించుకుంటే బిర్యానీ ఫ్రీ.. షరతుతో - MicTv.in - Telugu News
mictv telugu

పెట్రోల్ పోయించుకుంటే బిర్యానీ ఫ్రీ.. షరతుతో

September 21, 2020

Bengaluru: Get free biryani from this fue ..

పెట్రోల్ పోయించుకుంటే బిర్యానీని ఉచితంగా అందిస్తోంది ఓ సంస్థ. బెంగళూరు ఓల్డ్ మద్రాస్ రోడ్డులోని ఇందిరానగర్ ఆర్టీఓకు సమీపంలో ఉన్న వెంకటేశ్వర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సర్వీస్ స్టేషన్ ఫ్రీగా కాంప్లిమెంటరీ ఫుడ్ ప్యాకెట్లను అందిస్తోంది. సోమవారం నుంచి తన వినియోగదారులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 5 గంటల మధ్య ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంధన అవుట్‌లెట్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా తన కష్టమర్లకు బిర్యానీ (వెజ్, నాన్‌వెజ్)ని అందజేస్తోంది. గ్రూప్ రెస్టారెంట్ మేనకా ఫుడ్స్, ఐఓసీ సహకారంతో రూ.2,000 కన్నా ఎక్కువ ఇంధనం నింపే వారికి ఉచిత బిర్యానీ అందిస్తోంది. 

మరోవైపు రూ.250 కంటే ఎక్కువ ఇంధనం నింపేవారికి ప్రోత్సాహక బహుమతులు కూడా అందిస్తున్నారు. ఈ విషయమై నిర్వాహకుడు ప్రకాశ్‌రావు సాథే మాట్లాడుతూ.. ‘గత 51 ఏళ్లుగా ఈ ఐఓసీ స్టేషన్‌ను నిర్వహిస్తోంది. కర్ణాటకలోనే అత్యధికంగా అమ్మకాలు జరిగాయి. ఇన్ని సంవత్సరాలుగా మాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు వినియోగదారులకు కృతజ్ఞతలు ఈ విధంగా తెలుపుతున్నాం. ఈ ఆఫర్‌ను నెల పాటు కొనసాగిస్తాం. అనంతరం వివిధ ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపుతో కొనసాగించాలని యోచిస్తున్నాం’ అని ప్రకాష్‌రావు సాథే వెల్లడించారు.