తమిళనాడు చిన్నమ్మకు అడుగడుగునా కష్టాలే ఎదరవుతున్నాయి. కాలు తీసి కాలు పెడ్తామన్నా కష్టంగానే ఉంది. జైళ్లో అమ్మ గారి జీవితం గురించి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత మరింత కష్టాల పాలవుత్నారు శశికళ. జయ మరణం తర్వాత ఆమె తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదం అవుతూనే ఉంది. పార్టీనే రెండుగా చీలి పోయింది. నాయకుల మధ్య విభేధాలు వచ్చాయి. శశికళ ఒక్క ఆలోచన ఆ రాష్ట్ర రాజకీయాలనే తలకిందులు చేసే పరిస్థితి వచ్చింది. దీని కంతటికి కారణం అనాలోచిత నిర్ణయాలే నని తమిళ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
తాజాగా ఆమె వల్ల ఏఐడిఎంకే ప్రభుత్వానికి ముప్పు వాటిల్లేలా ఉంది. ఐదేండ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం రెండేండ్లు నిండకుండానే కూలి పోయేలా ఉంది. అప్పట్లో జయకు, జానకీ కి మధ్య గొడవలు జరిగినప్పుడు కొత్త పార్టీ పుట్టుకు రాలేదు. పైగా ఉన్న పార్టీపైనే పట్టు సాధించారు జయ. శశికళ వరకు వచ్చే వరకల్లా సీన్ రీవర్స్ అవుతున్నది. ఉన్న పార్టీనే పోయేట్లు ఉంది.
అంతేకాదు కొత్త పార్టీ పుట్టుకు రావడానికి చిన్నమ్మనే తీవాచీ పరిచి మరీ పిలుస్తున్నట్లుంది. ఏఐడిఎంకేలో జరుగుతున్న పరిణామాల తర్వాతనే తమిళనాట కొత్త పార్టీ పుట్టుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రజనీకాంత్, కమల్ హాసన్ దూసుకొస్తున్నారు. కమల్ హాసన్ రెండు అడుగులు ముందే ఉన్నారు. ఇప్పటికిప్పుడు కాక పోయినా కొత్త పార్టీ పుట్టుకు రావడం ఖాయమని, అనివార్యత ఉందని మాత్రం ప్రూవ్ అయింది.
తాజాగా శశికళ పై మరో ఆరోపణ వచ్చింది. జైలు నుండి చిన్నమ్మ తన మద్దతు దారుడైన ఓ ఎంఎల్యే ఇంటికి వెళ్లి వస్తున్నారని పోలీసు అధికారి రూప చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. బయట దినకర్ వేస్తున్న ఎత్తులు, చిన్నమ్మకు మరిన్ని చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. కాలం కల్సిరానప్పుడు ఏం చేసినా అంతే. అమ్మ బతికున్నప్పుడు శశికళ కనుచూపుతో నే అంతా సెట్ చేశారు. ఇప్పుడు కళ్లప్పగించి చూడటం తప్ప చేయగలిగిందేమీ లేదని అంటున్నారు ఆమె గురించి తెల్సినవారు.