ప్రేమించలేదని చెవి కోశాడు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమించలేదని చెవి కోశాడు

May 17, 2019

కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఇండిగో ఎయిర్ లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌‌గా పనిచేస్తున్న ఓ యువతిని వేధించసాగాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని జాలహళ్లిలో నివాసముంటున్న ఎయిర్‌హోస్టెస్‌‌‌ను స్థానిక రౌడీషీటర్ అజయ్ అలియాస్ జాకీ ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు. అతడి ఆగడాలపై ఆమె తల్లిదండ్రులు జాలహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెచ్చిపోయిన అజయ్ వారి ఇంటిపై దాడి చేసి తలుపులు, అద్దాలు పగులగొట్టాడు.

Bengaluru Man Allegedly Molests 20-Yr-Old IndiGo Flight Attendant and cut her ear.

ఈ నెల 13న అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని క్యాబ్‌లో ఇంటికి వస్తున్న ఎయిర్‌హోస్టెస్‌పై అజయ్ దాడి చేశాడు. ఆమె ప్రయాణిస్తున్న క్యాబ్‌ను హెబ్బాళ్ వంతెనపై అడ్డుకుని డ్రైవర్‌ను కత్తితో బెదిరించి కారులోకి ప్రవేశించాడు. వెనక సీట్లో కూర్చున్న ఆమెతో వాగ్వాదానికి దిగి ప్రేమించాలని వేధించాడు. అందుకు ఆ యువతి అంగీకరించకపోవడంతో కత్తితో చెవి కోసి అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో బాధితురాలు నగర పోలీసు కమిషనర్ సునీల్‌కుమార్‌ను కలిసి తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేసింది. దీంతో కోడిగెహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.