Bengaluru man caught red-handed installing camera in women's washroom
mictv telugu

కాలేజీలో కామాంధుడు..1200 అమ్మాయిల వీడియోలతో..

November 22, 2022

Bengaluru man caught red-handed installing camera in women's washroom

అమ్మాయిలకు రక్షణ కరువైంది. కొందరు కేటుగాళ్ళు మహిళలు ఉండే హాస్టళ్లు, షాపింగ్ కాంప్లెక్స్ లో ట్రైల్ రూమ్స్ వంటి వాటిలో సీసీ కెమెరాలు అమర్చి వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. తాజాగా బెంగళూరులోని ఇలాంటి దారుణ ఘటనే వెలుగుచూసింది. ఓ కాలేజ్‌లోని లేడీస్ బాత్రూంలో సీసీకెమెరాలను అమర్చిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గిరినగర సమీపంలోని హోసకరహళ్లిలో ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ ఎం. ఆజాద్ అలియాస్ ఆజాద్ అనే యువకుడు బీబీఎ ఎల్ఎల్ బీ ఐదవ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజ్‌లో అమ్మాయిల బాత్ రూమ్ లోకి వెళ్లిన ఆజాద్ అక్కడ సీక్రేట్ కెమెరా ఫిట్ చెయ్యడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన విద్యార్థినులు గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీకెమారాలును పరిశీలించారు. నిందితుడు ఆజాద్ గా గుర్తించి అతడిని అరెస్ట్ చేసారు.

ఆజాద్ విచారణలో ఆందోళనకర విషయాలు వెలుగు చూసాయి. అతని మొబైల్ ఫోన్ పరిశీలించిన పోలీసులు, కాలేజ్ యాజమాన్యం ఆశ్చర్యపోయారు. ఆజాద్ మొబైల్ ఫోన్‌లో కాలేజ్‌లో చదువుతున్న అమ్మాయిల అర్డనగ్న ఫోటోలు, వీడియోలు 1,200 పైగా ఉన్నాయని గుర్తించారు. ఇంతకుమందు నుంచే బాత్ రూమ్‌లో సీక్రేట్ కెమెరాలు పెట్టిన ఆజాద్ అమ్మాయిల అర్డనగ్న వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసులు తేల్చారు. ఆజాద్ దగ్గర ఇంకో స్మార్ట్ ఫొన్ ఉండటతో వాటిలో ఇంకా ఎన్ని వీడియోలు ఉన్నాయి అని పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే ఆజాద్ చేశాడని, ఆ సమయంలో ఇంకోసారి ఇలా చెయ్యనని కాలేజ్ యాజమాన్యంకు క్షమాపణపత్రం రాసి ఇచ్చినట్లు తెలుస్తోంది.