గేటు ముందు గలీజ్ చేస్తోందని కుక్కపై కాల్పులు - MicTv.in - Telugu News
mictv telugu

గేటు ముందు గలీజ్ చేస్తోందని కుక్కపై కాల్పులు

November 12, 2019

మూగ జంతువులపై కొందరు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఏవో నెపాలు పెట్టి వాటి ప్రాణాలు తీస్తున్నారు. ఇంటి గేటు ముందు ఓ వీధికుక్క మలమూత్ర విసర్జన చేస్తోందంటూ 75 ఏళ్ళ వృద్ధుడు ఓ కుక్కపై కాల్పులు జరిపాడు. బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. 

Bengaluru man dog.

నిందితుడు డాక్టర్ శ్యాంసుందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుందర్ భార్య మిలటరీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ దంపతులకు ఎయిర్ గన్ లైసెన్సు ఉంది. ఓ వీధి కుక్క తమ ఇంటి పరిసరాలను అపరిశుభ్రం చేస్తోందని, అందుకే దాన్ని కాల్చానని సుందర్ తన స్నేహితులకు చెప్పాడు. విషయం స్థానికులకు తెలియడంతో నెత్తురోడుతున్న కుక్కను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాని శరీరంలోంచి రెండు బుల్లెట్లను డాక్టర్లు బయటికి తీశారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడానే ఉందని తెలిపారు. కుక్కలతో సమస్య ఉంటే మునిసిపాలిటీ వారికి చెప్పాలని, ఇలా కాల్పులు జరపొద్దని జంతు హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు.