చెబితే వింటేనా.. ఇక అద్దంలో చూసుకుంటూ మూత్రం పోస్కోండి - MicTv.in - Telugu News
mictv telugu

చెబితే వింటేనా.. ఇక అద్దంలో చూసుకుంటూ మూత్రం పోస్కోండి

January 14, 2020

kjngbkj

‘ఇచ్చట మూత్రం పోయరాదు..’ అని తాటికాయంత అక్షరాలతో రాసినా, అక్కడే పోయాలని కోరుతున్నారేమో అంటూ చక్కగా అర్థం చేసుకుని అక్కడే పోసేస్తుంటారు జనం. బహిరంగ మూత్రవిసర్జనను అడ్డుకోడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకపోతోంది. జరిమానాలు, శిక్షలు పనిచేయడం లేదు. టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నా ఫలితాలివ్వడం లేదు. అందుకే బెంగళూరు మునిసిపల్ అధికారులు సిగ్గుతో చచ్చిపోయే ఐడియా ఒకటి కనిపెట్టి అమలు చేస్తున్నారు. 

మూత్రం పోస్తున్న స్థలాలను ఎంచుకుని అక్కడ గోడకు అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా అక్కడ మూత్రం పోస్తే అద్దంలో కనిపించక తప్పదు. మనకు మనమే కనిపించడంతోనే సీన్ అయిపోదు. రోడ్డుపైన వెళ్లున్న వారికీ మన విశ్వరూపదర్శన భాగ్యం లభిస్తుంది. మనల్ని మనం చూసుకుంటూ, మనల్ని వేరేవాళ్లు చూస్తూ సిగ్గుతో చికితిపోవాలన్నమాట. చర్చ్‌స్ట్రీట్, ఈఎస్‌ఐ ఆస్పత్రి వద్ద ఇలాంటి ‘యూరిన్ అద్దాలు’ పెట్టేసింది బీబీఎంసీ. అయితే జనం వీటిని పగలగొడితే ఎలా అని కొత్త సందేహాలు వస్తున్నాయి. చుట్టూ సీసీ కెమరాలుఉంటాయి కనుక అలాంటివి జరక్కపోవచ్చని బీబీఎంపీ భరోసాతో ఉంది. అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు అద్దాలకు మూత్రం బాబులు ఎలా చెక్ పెడతారో చూడాలి.