గడ్డిలోంచి విమానం టేకాఫ్.. పైలెట్ల సస్పెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

గడ్డిలోంచి విమానం టేకాఫ్.. పైలెట్ల సస్పెన్షన్

November 14, 2019

180 మంది ప్రయాణిస్తున్న గోఎయిర్ సంస్థ విమానానికి బెంగళూరులో భారీ ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో పైలెట్.. అదుపు తప్పి రన్‌వే పక్కనే ఉన్న గడ్డి మైదానంలోకి విమానాన్ని తీసుకెళ్లాడు. అదృష్టవశాత్తూ విమానం తర్వాత టేకాఫ్ తీసుకోవడంతో ముప్పు తప్పింది. గడ్డిలోంచి టేకాఫ్ తీసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

Bengaluru Pilots.

సోమవారం ఈ సంఘటన జరిగింది. నాగపూర్ నుంచి వచ్చిన గో ఎయిర్ ఏ320 విమానం గమ్యస్థానమైన బెంగళూరు చేరుకుంది. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో విమానం అదుపు తప్పి గడ్డి మైదానంలో వెళ్లిపోయింది. పైలెట్ తడబడకుండా వేగం పెంచడంతో గడ్డి మధ్యనుంచే పైకి లేచింది. విమానాన్ని తర్వాత హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన తీవ్రంగా స్పందించింది. విచారణకు ఆదేశించి పైలెట్లను సస్పెండ్ చేయించింది. సాంకేతిక లోపం కారణంగా గత నెల హైదరాబాద్ వెళ్ళాల్సిన విమానం ఒకటి పట్నాలో దిగింది.