రైల్వే సూపర్.. ఈ ట్యాప్‌లో శానిటైజర్, ఆ ట్యాప్‌లో నీళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

రైల్వే సూపర్.. ఈ ట్యాప్‌లో శానిటైజర్, ఆ ట్యాప్‌లో నీళ్లు

August 14, 2020

Bengaluru railway station gets foot-operated hand wash kiosk, netizens praise initiative.

అలా సాగుతున్న వ్యవస్థలోకి ఒక్కసారిగా విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది కరోనా వైరస్. ‘కరోనాకు ముందు – కరోనాకు తర్వాత పరిస్థితి’ అన్నతీరుగా తయారైంది. ప్రతీ రంగాన్ని కరోనా విపరీతంగా ప్రభావితం చేసింది. తప్పదన్నట్టు ప్రజలు తమ దైనందిన జీవితంలో అనేక మార్పులకు స్వాగతం పలికారు. కొత్త అలవాట్లతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కాదు కూడదు అంటే గట్టు మీద పొంచి ఉన్న కరోనా ఊరుకోదుగా అన్నట్టు తయారయ్యాయి పరిస్థితులు. ఈ క్రమంలో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాజాగా భారత రైల్వే సరికొత్త ఆలోచన చేసింది.

రైల్వే స్టేషన్లలో చేతులు శుభ్రం చేసుకునేందకు ఓ నూతన, మనకు పరిచయమే లేని విధానాన్ని తీసుకువచ్చింది. ట్యాప్‌కి బదులుగా తాకనవసరం లేని ‘టచ్‌ ఫ్రీ హ్యాండ్‌ వాష్‌’ను అందుబాటులోకి తెచ్చింది. వీటిని ముందుగా బెంగళూరులోని కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను భారతీయ రైల్వే ట్వీట్ చేసింది. కాలి గుర్తులు ఉన్నచోట కాలితో ప్రెస్‌ చేయాలి. అప్పుడు ఒక ట్యాప్‌లో లిక్విడ్‌ సోప్‌, మరో ట్యాప్‌లో నీళ్లు వచ్చేలా వీటిని రూపొందించింది. దీనికి ‘మన భద్రత మన చేతుల్లోనే ఉంది’ అనే వ్యాఖ్యను జోడించింది. కాగా, భారతీయ రైల్వే తీసుకువచ్చిన ఈ విధానంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. వీలైనంత తొందరగా ఇలాంటివి దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ అందుబాటులోకి తెస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు.