టెన్త్ పరీక్షలు రాసిన 32 మంది పిల్లలకు కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

టెన్త్ పరీక్షలు రాసిన 32 మంది పిల్లలకు కరోనా

July 4, 2020

Benguluru

కరోనాలో పదో తరగతి పరీక్షలు నిర్వహించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని చాలా రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసుకున్నాయి. కానీ, బెంగుళూరులో మాత్రం టెన్త్ పరీక్షలు నిర్వహించి, విద్యార్థులను కరోనాకు టార్గెట్ చేశారు. శుక్రవారం బెంగుళూరులో పరీక్షలకు హాజరైన 32 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించినప్పటికీ.. విద్యార్థులకు కరోనా సోకడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు పరీక్షలకు హాజరైయ్యేందుకు జంకుతున్నారు. వారికి విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో పర్యటిస్తూ ధైర్యం చెబుతున్నారు. ఇదిలావుండగా కర్ణాటకలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సుమారు 70–80 శాతం పాజిటివ్‌ కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదవుతున్నాయి. దీంతో నగరవాసుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గత జూన్‌ నెలలో బెంగళూరులో మొత్తం 4,198 మందికి కరోనా సోకగా, అందులో 85 మంది చనిపోయారు. కేవలం 312 మంది మాత్రమే కోలుకున్నారు.