హెల్మట్ ఏసీ.. తక్కువ ధరకే.. మనోడి ఆవిష్కరణ  - MicTv.in - Telugu News
mictv telugu

హెల్మట్ ఏసీ.. తక్కువ ధరకే.. మనోడి ఆవిష్కరణ 

September 16, 2019

helmets ....................

ఎండాకాలం వాహనదారులు హెల్మెట్ ధరించాలంటే భారంగా భావిస్తారు. హెల్మెట్ ధరిస్తే ఉక్కపోతగా ఉండడం, చెమట రావడమే ఇందుకు కారణం. ఈ సమస్యకు పరిష్కారంగా బెంగళూరుకు చెందిన మెకానికల్‌ ఇంజనీర్‌ సందీప్ దహియా ‘వాతానుకూల’ పేరుతో హెల్మెట్‌కు ఏసీను లింకు చేశాడు. వేసవిలో చల్లగాను, చలికాలంలో వేడిగా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేశాడు. సందీప్‌ తయారు చేసిన ఏసీ హెల్మెట్‌ వాహనదారులను ఆకర్షిస్తోంది. వీపుపై జాకెట్‌కు వెనుక తగిలించుకుని హెల్మెట్‌కు ఏసీ గాలి వచ్చేలా ఈ సాధనాన్ని తయారు చేశారు.

గత నాలుగేళ్ల నుంచి సందీప్‌ దహియా హెల్మెట్లపై అనేక ప్రయోగాలను చేస్తున్నారు. బైకుకు ఉయోగించే 12 ఓల్ట్‌ సామర్థ్యంగల బ్యాటరీని ఇందుకు ఉయోగించారు. హెల్మెట్‌ ధరించటంతో తలలో వేడి పుడుతుంది. దీంతో వెంట్రుకలు రాలిపోతున్నట్లు కొందరు అంటుంటారు. ఈ కారణంతో తను తయారు చేసే హెల్మెట్‌ అన్ని వాతావారణాలకు అనుకూలంగా ఉండలానే ఉద్దేశంతోనే ‘వాతానుకూల’గా హెల్మెట్‌కు పేరు పెట్టినట్లు సందీప్‌ తెలిపాడు. 

helmets ....................

సాధారణ హెల్మెట్‌ 8 వందల గ్రాముల నుండి 2 కేజీలుంటుంది. వాతానుకూల హెల్మెట్‌ 1.7 కేజీల బరువు ఉంటుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. వీపుపై బ్యాక్‌ప్యాక్‌తో ఏసీ పరికరాన్ని తగిలించుకోవాలి. అక్కడ నుండి రబ్బర్‌ ట్యాబ్‌ ద్వారా తలకు ధరించిన హెల్మెట్‌కు గాలిని అందిస్తుంది. వేడిని చల్లగా మార్చే ఏర్‌ కూలింగ్‌ పని చేస్తుంది. ఈ చల్లదనాన్ని అందిస్తున్న పరికరాలకు నీరు అవసరంలేదు. హెల్మెట్‌కు బ్యాటరితో ఎలాంటి సంబధం లేదు. రబ్బర్‌ నుండి గాలిని హెల్మెట్‌కు అందిలా వ్యవస్థను కల్పించారు. ఏసీని నియంత్రించటానికి సాధనంలో ఒక చిన్న రిమోట్‌ను కూడా ఉపయోగించారు. ఇప్పుటి వరకు డిమాండ్‌ ఆధారంగా 40 ఏసీ హెల్మెట్‌లను విక్రయించానని సందీప్ తెలిపాడు. వాతానుకూల హెల్మెట్ బట్టి ధరలుంటాయని సందీప్‌ తెలిపాడు. కనీసం రూ.3 వేల నుండి రూ.7 వేల వరకు ధర ఉంటుందని తెలిపాడు.