బెంగళూరు హింస.. సూత్రధారి సాదిక్ అలీ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

బెంగళూరు హింస.. సూత్రధారి సాదిక్ అలీ అరెస్ట్

September 24, 2020

bengaluru violence sadiq ali arrested.

యావత్ దేశం సంచలనం సృష్టించిన బెంగళూరు అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి సయ్యద్‌ సాదిక్‌ అలీని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. బెంగళూరులోని దళిత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై ఆగష్టు 11న అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ దాడిలో ముగ్గురు మృతిచెందారు. ఈ దాడికి సాదిక్ అలీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఓ బ్యాంకులో రికవరీ ఏజెంటుగా పనిచేస్తున్న సయ్యద్‌ సాదిక్‌ అలీ ఈ ఘటన తర్వాత అజ్ఞాతంలో​కి వెళ్లాడు. 

ఈరోజు ఎన్‌ఐఏ అధికారులు 30 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎయిర్‌గన్‌, పదునైన ఆయుధాలతో పాటు, ఐరన్‌ రాడ్డులతో పాటు పలు ఎలక్ట్రానిక్‌ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సాదిక్ అలీని అదుపులోకి తీసుకున్నారు. ఓ సోషల్‌ మీడియాలో పోస్టు కారణంగా ఈ అల్లర్లు జరిగాయి. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం ఎదుట ఉన్న వాహనాలకు అల్లరి మూకలు నిప్పు పెట్టడంతో పాటుగా, డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్‌ స్టేషన్లపై దాడి చేశారు. ఈ ఘటన జాతీయస్థాయిలో వివాదం కావడంతో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సెప్టెంబరు 21న ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది.