పుష్పకు  వందనం.. 700 మంది దివ్యాంగుల పరీక్షలు రాసి.. - MicTv.in - Telugu News
mictv telugu

పుష్పకు  వందనం.. 700 మంది దివ్యాంగుల పరీక్షలు రాసి..

March 15, 2019

జనంలో సామాజిక స్పృహ సన్నగిల్లుతోంది. పోటీ ప్రపంచంలో సొంత పనుల కోసమే సమయం సరిపోవడం లేదు.. ఇక ఇతరులకు సేవ ఎలా చేయడం అని ఎందరో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ బెంగళూరు నగరానికి చెందిన పుష్ప ఎన్ఎమ్ మాత్రం ఇందుకు విరుద్ధం. స్వంతగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయి ఉండి.. బిజీ జీవితాన్ని గడిపే పుష్ప.. పరీక్షలు రాయలేని ఎందరో దివ్యంాగులకు లేఖరిగా(స్క్రైబ్) వ్యవరిస్తూ వారి బంగారు భవిష్యతుకు బాటలు వేస్తున్నారు. లేఖరిగా 2007లో మొదలైన ఆమె ప్రస్థానంలో ఇప్పటి వరకు దాదాపు 700 మంది కంటే ఎక్కువ మంది దివ్యంాగ విద్యార్థులకు లేఖరిగా సేవలందించారు. ఆమె చేసిన కృషికి గుర్తుగా 2018లో రాష్ట్రపతి చేతుల మీదుగా నారి శక్తి పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

2007వ సంవత్సరంలో బెంగళూరులో ఓ ఎన్జీఓ నడిపే స్నేహితురాలు ఒకరు పుష్పను ఒక అంధ విద్యార్థికి లేఖరిగా సేవలందించామని కోరడం.. దానికి పుష్ప అంగీకరించడంతో ఈ సేవ మొదలైంది. ‘నేను ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని జీవితంలో పైకి వచ్చాను. డబ్బు సంపాదన నాకు ద్వితీయం… ఎవరికైనా సహాయం చేసి వారి మోహంలో చిరునవ్వు చూడడానికే ప్రాధాన్యం ఇస్తానని’ అని పుష్ప తెలిపారు.

‘పుష్పా మేడం మాకు దైవస్వరూపురాలు.. మా కొడుకు కార్తీక్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. కార్తీక్‌కు లేఖరిగా పుష్ప మేడమే వ్యవహరించారు. ఆమె మా కొడుకు ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని ఓపిగ్గా పరీక్ష రాఆరు.. అందుకే మా కొడుకు మంచి మార్కులతో పాసయ్యాడు. మేం పుష్ప మేడంకు జీవితాంతం రుణపడి ఉంటాము.’ అని ఓ విద్యార్థి తండ్రి చెప్పాడు.

మరికొందరైతే ఆమెను బ్రహ్మకంటే గొప్పవ్యక్తి అని ప్రశంసింస్తున్నారు. తలరాతలు రాసే బ్రహ్మ.. దివ్యాంగుల విషయంలో ఆ రాతను తప్పుడుతడకలు రాశాడని, కానీ పుష్పామేడం మాత్రం వారి భవిష్యత్తును చక్కగా రాస్తున్నారని అంటున్నారు.