చెరకు రసం తాగడం వల్ల కలిగే లాభాలు ఇవీ - MicTv.in - Telugu News
mictv telugu

చెరకు రసం తాగడం వల్ల కలిగే లాభాలు ఇవీ

May 12, 2022

వేసవికాలంలో ఎండ వేడిమి నుంచి శరీరాన్ని కాపాడుకోవడంలో చెరకురసం చాలా ఉపయోగకారిగా ఉంటుంది. అంతేకాక, శరీరానికి కావాల్సిన పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. కాలేయం సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, బీపీ ఉన్న వారికి చెరకు రసం చాలా మేలు చేస్తుంది. ఎముకలను దృఢంగా చేసే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులోని పొటాషియం జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్లు రాకుండా సహాయపడుతుంది. పంటిపై పొర దెబ్బతినకుండా చెరకురసం కాపాడుతుంది. నోటి దుర్వాసనకు పోగొడుతుంది. జలుబు, జ్వరం, దగ్గు వంటి రోగాలతో ఇబ్బందిపడుతుంటే చెరకురసం తాగడం వల్ల ఉపశమనం పొందొచ్చు. వారంలో మూడు సార్లు చెరకు రసం తీసుకుంటే శరీరంలోని విషపూరిత పదార్ధాలను బయటకు పంపడంలో చాలా బాగా పని చేస్తుంది.