అట్లుంటది ఇండియాతోటి.. ఆటో ఎక్కిన బెంజ్ సంస్థ సీఈఓ - MicTv.in - Telugu News
mictv telugu

అట్లుంటది ఇండియాతోటి.. ఆటో ఎక్కిన బెంజ్ సంస్థ సీఈఓ

September 30, 2022

అత్యంత ఖరీదైన కార్లు తయారు చేసే కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ సీఈవో మార్టిన్‌కి ఇండియాలో వింత అనుభవం (మనకు కాదులే) ఎదురైంది. పుణెలో ఖరీదైన తన కారులో ప్రయాణిస్తున్న ఆయనకు అక్కడి ట్రాఫిక్ చుక్కలు చూపించింది. అంత ట్రాఫిక్‌ నుంచి బయటపడలేమని భావించి ఏం చేయాలో తోచక తన మెర్సిడెస్ ఎస్ క్లాస్ బెంజ్ కారును రోడ్డు మీదే వదిలేశాడు. కారును వదిలి నడకను ఆశ్రయించాడు. అలా ఓ కిలోమీటరు వెళ్లి తర్వాత అందుబాటులో ఉన్న ఓ ఆటో రిక్షా ఎక్కాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Martin Schwenk (@martins_masala)

తర్వాత తనకెదురైన వింత అనుభవాన్ని ఫోటోలతో సహా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. దాంతో పాటు ‘అద్భుతమైన పుణె రోడ్లపై మీ ఎస్ క్లాస్ కారు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే.. మీరు ఏం చేస్తారు? కారు దిగి కిలోమీటర్ దూరం నడిచి ఆటో ఎక్కుతారా? అని కామెంట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ అవడంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. అట్లుందటి ఇండియాలో అని, ఆటో డ్రైవరు మీటరు మార్చలేదా? అని, మీరు చాలా అదృష్టవంతులు. అంత ట్రాఫిక్‌లో ఆటో డ్రైవర్లు గమ్యస్థానానికి చేర్చడానికి ఒప్పుకోరు అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, 2006లో మెర్సిడెస్ బెంజ్‌లో జాయిన అయిన మార్టిన్.. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 2018 వరకు మెర్సిడెస్ బెంజ్ చైనా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పని చేశారు. 2018 నుంచి బెంజ్ కంపెనీ సీఈవోగా కొనసాగుతున్నారు.