Berhampur As ‘Ritualists’ Clash With ‘Rationalists’ Over Lunar Eclipse Traditions
mictv telugu

గ్రహణం రోజున భోజనాలు పెడితే ఆవు పేడతో కొట్టారు..

November 9, 2022

చంద్రగ్రహణం రోజున ఒడిశా లోని గంజాం జిల్లా బ్రహ్మపురలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. గ్రహణాలపై ఉన్న అపోహలు, మూఢ నమ్మకాలను తొలగించేందుకు ‘మానవతావాది హేతు సంస్థ’ సామూహిక భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. గంజాం జిల్లా బ్రాహ్మణ పురోహిత సమితి, భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు వ్యతిరేకించాయి. ‘మానవతావాది హేతు సంస్థ’కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి. అంతటింతో ఆగకుండా చారవాక్ భవన్ వద్ద ‘మానవతావాది హేతు సంస్థ’ప్రతినిధులపై వాగ్వాదానికి దిగి ఆవు పేడతో దాడి చేసారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.. ‘మానవతావాది హేతు సంస్థ’ప్రతినిధులను అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. గ్రహణం భోజనాలను అడ్డుకోవడం దారుణమని హెచ్ఆర్ఓ ప్రతినిధలు విచారం వ్యక్తం చేస్తున్నారు.