మనలో చాలా మంది చిన్నిచిన్న విషయాలు మర్చిపోతూ ఉంటారు. పిల్లలు చదివిన విషయం మర్చిపోతే, పెద్దవాళ్ళు చేయాల్సిన పనులు మర్చిపోతున్నారు.దీనివల్ల చాలా ిబ్బందులు ఎదుర్కోంటున్నారు. సాంకేతికత పెరిగిన కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. దగ్గరవారి పుట్టిన రోజు గుర్తించుకోవడానికి కూడా చాలా మంది రిమైండర్ల మీద, సోషల్ మీడియా నోటిఫికేషన్ల మీద ఆధారపడుతున్నారు. ఇప్పడు ఇది పెద్ద విషయం అనిపించకపోయినా భవిష్యత్తులో ఈ చిన్నచిన్న విషయాలు మర్చిపోయే అలవాటు అల్జీమర్స్, డిమెన్షియా, వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
నిద్ర:
మన జాపకశక్తి పెరగడానికి నిద్ర చాలా అవసరం. మన రాత్రి నిద్రపోయే సమయంలో న్యూరాన్ల మధ్య కనెక్షన్లు అవసరం లేని జ్ఞాపకాలను తొలగించడానికి పని చేస్తాయి. రాత్రి సమయంలో సినాప్సెస్ మరుసటి రోజు కొత్త జ్ఞాపకాలను రూపొందించడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. పెద్దలు రోజుకు కనీసం పెద్దలకు కనీసం 7-8 గంటల నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతున్నారు.
వ్యాయామం:
జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ప్రతిరోజూ వ్యాయమం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వర్కవుట్ కారణంగా.. శరీరంతో పాటు మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల మెదడు మెరుగ్గా పనిచేస్తుంది, జాపకశక్తి మెరుగుపడుతుంది.
కొత్త విషయాలు నేర్చుకోవాలి:
రోజూ ఏదో కొత్త విషయం నేర్చుకుంటే.. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇది మనం పనిలో నిమగ్నం చేయడానికి సహాయపడుతుంది. ఇలా చేస్తే.. మన మెదడులో కొత్త న్యూరాన్ కనెక్షన్లు ఏర్పడతాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడానికి పనిచేస్తాయి.
ఆహారం:
మెదడు సరిగ్గా, ప్రభావవంతంగా పనిచేయడానికి తగిన పోషకాహారం అవసరం. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి.. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బ్రెయిన్ యాక్టివ్‌గా పనిచేయడానికి వాల్నట్లు, బ్రోకలీ, పసుపు, డార్క్ చాక్లెట్ , టమాటా, గుడ్లు, తృణధాన్యాలు, ఆకుకూరలు, టమాటా వంటి ఆహార పదార్థాలు రెగ్యులర్ గా తినాలి.
టెక్నాలజీ మీద ఆధారపడవద్దు:
మనం గుర్తుకుంచుకోవాల్సిన విషయాల గురించి టెక్నాలజీ మీద ఆధారపడకుండా ఉంటే మంచింది. అది చెబుతుంది కదాని డేట్లు మర్చిపోవడం కంటే మనమే మన మెదడుకు పని కల్పించి గుర్తుంచుకునేట్టు చేసుకుంటే మంచింది. ఇది ఒక్క డేట్ల విషయంలోనే కాదు మిగతా విషయాల్లో కూడా పాటిస్తే మన జ్ఞాపకశక్తిని ఎవ్వరూ అడ్డుకోలేరు.
మల్టీ టాస్కింగ్ వద్దు:
బిజీబీజీ లైఫ్‌స్టైల్ కారణంగా మల్టీ టాస్కింగ్ పెరిగిపోయింది. మల్టీ టాస్కింగ్ మనకు చాలా ఉపయోగపడుతుంది, కాదనడానికి లేదు. కానీ దీనివల్ల మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒక సమయంలో రెండు పనులు చేసినప్పుడు ఏకాగ్రత డివైడ్ అవుతుంది. ఇధి జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుంది.