డ్రాగన్ పిల్ల పశ్చాత్తాపం.. బెస్ట్ క్రిస్మస్ యాడ్ (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

డ్రాగన్ పిల్ల పశ్చాత్తాపం.. బెస్ట్ క్రిస్మస్ యాడ్ (వీడియో)

November 14, 2019

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. మార్కెట్లలో కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. పాశ్చాత్య దేశాల్లో అతిపెద్ద పండగ కావడంతో జనాన్ని ఆకర్షించేందుకు కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా యాడ్స్ రూపొందిస్తున్నాయి. కొందరు క్రియేటివిటీని చాటుకోడానికి కూడా యాడ్స్ తయారు చేస్తున్నారు. అలాంటివాటిలో ఈ రోజు విడుదైన డ్రాగన్ పిల్ల యాడ్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. జాన్ లెవీస్ అండ్ పార్ట్నర్స్ కంపెనీ దీన్ని రూపొందించింది. 

‘ఎడ్గార్ ద డ్రాగన్’ అనే ఈ వీడియోలో చురుకైన డ్రాగన్ పిల్ల చేసే చేష్టలు నవ్వు పుట్టిస్తాయి. దొడ్డి కాళ్లు, బానపొట్టతో చూడగానే నవ్వు తెప్పించే ఎడ్గార్ ఓ ఊరిలో చేసే సందడిని చూపించారు. దాని నోట్లోంచి అగ్గి రావడం, జనం ఇబ్బంది పడడం, అది కూడా తప్పు చేశానని తెగ ఇదైపోవడం, ముక్కుకు గుడ్డ కట్టుకోవడం, అగ్గి ముక్కులోంచి కాకుండా చెవుల్లోంచి బయటికి రావడం, పిల్లాపెద్దలను ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ కానుక, విందులో యాడ్ ముగుస్తుంది. ఇది బెస్ట్ క్రిస్మడ్ యాడ్ అని వీక్షకులు కితాబిస్తున్నారు. మాటల్లో చెప్పేకంటే చూస్తేనే దీన్ని విశేషమేంటో తెలుస్తుంది.