తులసి.. పూజకే కాదు, ఆరోగ్యానికీ అమ్మలా.. - MicTv.in - Telugu News
mictv telugu

తులసి.. పూజకే కాదు, ఆరోగ్యానికీ అమ్మలా..

September 13, 2019

Best Health Tips to Tulsi.

తులసి చెట్టు ప్రతి ఇంట్లోనూ దర్శనమిస్తుంది. దీన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. ఎన్నో రకాల తులసి మొక్కలు ఉన్నప్పటికీ రామ తులసి,కృష్ణ తులసి మాత్రమే బాగా ప్రాచుర్యం పొందాయి. రామ తులసిని పూజకోసం, కృష్ణతులసిని ఆయుర్వేదంలో ఔషదం కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. అనాదికాలంగా తులసిని ఇంట్లో ఉంచుకుంటే అనేక ఆరోగ్యపరమైన లాభాలు ఉంటాయని విశ్వసిస్తుంటారు. ఇంటిల్లిపాదికి అనేక రకాల  ఆరోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుంది. ఇంతలా ప్రకృతి వైద్యంలో దీన్ని ఎందుకు వాడుతారు.. దీంట్లో ఉన్న ఔషద గుణాలు ఏంటీ..? దాన్ని ఎలా వాడుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయోజనాలు : 

 

ప్రతి రోజూ తులసి ఆకును తినడం వల్ల నాడులు ఉత్తేజితమై జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

 

తలనొప్పి ఉన్నవారు తులసి ఆకులను డికాషన్‌లో వేసుకొని తాగితే నొప్పి దూరం చేసుకోవచ్చు.

 

తులసి ఆకులను ఎండబెట్టి వాటిని పొడిచేసిన తర్వాత ఆవనూనెతో కలిపి పళ్లు తోముకుంటే దుర్వాసన, పంటినొప్పి రాకుండా చూడవచ్చు.

 

నోటిపూత,ఇన్‌ఫెక్షన్ల ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే మంచిది. 

 

చెవిపోటు ఉన్నవారు తులసి, వెల్లుల్లి రసాన్ని చెవిలో పోసుకుంటే ఉపశమనం కలుగుతుంది. 

 

ప్రతిరోజు ఐదారు ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు తగ్గుతాయి. 

 

మలేరియా, డెంగీ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే జ్వరం నుంచి బయటపడవచ్చు.

 

దీంట్లో షుగర్ తగ్గించే గుణాలు ఉండటం వల్ల డయాబెటిస్ రోగులకు మంచి మందులా పనిచేస్తుంది. 

 

రెండు స్పూన్ల తులసి రసానికి తేనే కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది. 

 

ముఖంపై ఉన్న మచ్చలుపోయి కాంతివంతంగా మారాలంటే తులసి ఆకును నూరి రాసుకుంటే ఫలితం ఉంటుంది. 

 

మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి రసానికి పాలు, చెక్కరగా కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది. 

 

కఫంతో వచ్చే దగ్గు తగ్గాలంటే చెంచా తులసి రసం, తేనే కలిపి తీసుకోవాలి. 

 

ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో తులసి ఆకులను వేసుకొని తాగితే చర్మవ్యాధులను దూరం చేయవచ్చు. 

కాళ్ల వాపు ఉన్నవారు తులసి రసం తాగితే మంచిది.