Best Hollywood Movies Of 2022
mictv telugu

2022 టాప్ – 5 హాలీవుడ్ చిత్రాలు..!

December 28, 2022

Best Hollywood Movies Of 2022

2022 సంవత్సరం హాలీవుడ్ ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిందనే చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలను హాలీవుడ్ అందించింది. అద్భుతమైన కథలు, టెక్నాలజీతో ప్రపంచ ప్రేక్షకులని ఆశ్చర్యపరచటంలో హాలీవుడ్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ప్రయోగాలు చేయడంలో హాలీవుడ్ దర్శక నిర్మాతలు అసలు వెనుకాడరు. అందుకే ప్రపంచంలోనే బెస్ట్ ఫిలిం ఇండస్ట్రీగా వెలుగొందుతుంది హాలీవుడ్ . ఈ సందర్భంగా 2022లో వచ్చిన ఉత్తమ హాలీవుడ్ సినిమాలు ఏంటో చూద్దామా. .

హాలీవుడ్ 2022లో టాప్ 5 ఉత్తమ సినిమాలు:

1. టాప్ గన్

ప్రముఖ అంతర్జాతీయ వెబ్ సైట్ IMDbలో 8.4/10తో హైయెస్ట్ రేటింగ్‌ దక్కించుకున్న మూవీ టాప్ గన్ (మావెరిక్). జోసెఫ్ కోసిన్స్కి దర్శకత్వం వహించిన ఈ మూవీ నావికాదళంలో అత్యుత్తమ ఏవియేటర్లలో ఒకరైన పీట్ “మావెరిక్” మిచెల్ కథాంశంతో మొదలవుతుంది. నావికాదళంలో 30 సంవత్సరాల పాటు సేవలను అందించిన మావెరిక్ మిచెల్ చెప్పే తన గత స్మృతుల సమ్మేళనమే టాప్ గన్. ప్రత్యేక అసైన్‌మెంట్ కోసం గ్రాడ్యుయేట్‌ల బృందానికి శిక్షణ ఇస్తూ, మావెరిక్ తన అనుభవాలను, లోతైన భయాలను, దాన్ని ఎదుర్కొన్న విధానాలను చెప్తూ మోటివేట్ చేస్తాడు. ప్రతి అవియేటర్ కి అంతిమంగా కావాల్సింది త్యాగం, లక్షాలని చేరుకోవటమే అనే మెసేజ్ ఇచ్చే టాప్ గన్ అద్భుతమైన థ్రిల్లర్. ఈ చిత్రంలో టామ్ క్రూజ్, మైల్స్ టెల్లర్, జెన్నిఫర్ కన్నెల్లీ, జోన్ హామ్‌లు అద్భుత నటనకి కనబరిచారు. .

2. అవతార్

అద్భుత ఆవిష్కరణ ‘అవతార్’ విడుదలైన 13 ఏళ్లకి ‘అవతార్ : ది వె ఆఫ్ వాటర్’ ని రిలీజ్ చేశాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. జంతు జాలంతో కూడిన ఒక వింత, కొత్త ప్రపంచంలోకి మానవ అవతారాలు ప్రవేశిస్తే జరిగే పరిణామాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రధానంగా మానవ జాతి దురాశపై ఈ కథాంశం ఉంటుంది. అవతార్ 2 ఇండియా వ్యాప్తంగా మంచి వసూళ్ళని రాబడుతోంది. విడుదలైన 10రోజుల్లో ఇండియాలో 250 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను సొంతం చేసుకోగా.. అమెరికాలో 254 మిలియన్ డాలర్స్‌ మరియు ప్రపంచవ్యాప్తంగా 602 మిలియన్ డాలర్స్‌ను కొల్లగొట్టి బెస్ట్ కమర్షియల్ చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా 856 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటిన ఈ మూవీ IMDbలో 8/10 రేటింగ్ ని దక్కించుకుంది.

3. ది బాట్‌మాన్

ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హీరో చిత్రాలకు భారీ క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘ది బాట్‌మాన్’ కథాంశాలు ప్రపంచ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటాయి. రాబర్ట్ ప్యాటిన్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా $ 650 మిలియన్ల మార్కును దాటి నంబర్ థర్డ్ పొజిషన్ లో నిలిచింది. ఇయర్ వన్ కామిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ బ్యాట్‌మ్యాన్ చిత్రం రాబర్ట్ ప్యాటిసన్ అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. మాట్ రీవ్స్ కామిక్స్ నుండి డార్క్ నైట్ యొక్క డిటెక్టివ్ యాంగిల్‌ను ఈ చిత్రంలో చూపెట్టారు. ది బాట్‌మాన్ కి 7.8/10 రేటింగ్ ఇచ్చింది IMDb.

4. ది నార్త్‌మ్యాన్

రాబర్ట్ ఎగ్గర్స్ దర్శకత్వం వహించిన ది ది నార్త్‌మ్యాన్ కథ రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. తండ్రిని హత్య చేసిన తన మేనమామపై హీరో వైకింగ్ ప్రిన్స్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే అసలు కథ. ది నార్త్‌మ్యాన్ పూర్తి హింస నేపథ్యంలో తీసిన క్రూయల్ రివెంజ్ డ్రామా. రాబర్ట్ ఎగ్గర్స్ దర్శకత్వం వచించిన ఈ అమెరికన్ థ్రిల్లర్ IMDb రేటింగ్ 7.7/10

5. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

డాన్ క్వాన్, డేనియల్ షీనెర్ట్ దర్శకత్వం వహించిన అద్భుత సైన్స్ ఫిక్షన్ ‘Everything Everywhere All at Once’. మిచెల్ యో, స్టిఫైన్,
కే హ్యూ వంటి చైనా అగ్ర తారలు నటించిన ఈ చిత్రం నిస్సందేహంగా 2022లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. ఒక చైనీస్ వలసదారుడు బలవంతంగా ఒక వింత ప్రపంచంలోకి వెళ్తే జరిగే పరిణామాల చుట్టూ సినిమా ఉంటుంది. సమాంతర విశ్వంలో తన యొక్క విభిన్న వెర్షన్‌లను కనెక్ట్ చేసుకుంటుంది ఈ చిత్రం. దీనికి IMDb ఇచ్చిన రేటింగ్ 8.1/10.

ఇక 2022 లో విడుదలైన మరిన్ని అద్భుతమైన చిత్రాలు: ది మెనూ, ది బాన్‌షీస్ ఆఫ్ ఇన్‌షెరిన్, ఎల్విస్, నోప్, విర్డ్: ది అల్ యాంకోవిక్ స్టోరీ.