best home food and remedies for muscle pain in winter
mictv telugu

శీతాకాలంలో కీళ్ళ నొప్పులు- హోమ్ రెమిడీస్

January 4, 2023

best home food and remedies for muscle pain in winter

శీతాకాలం కీళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువగా బాధిస్తాయి. వణికించే చలి, బిగుసుకుపోయిన కీళ్ళ కారణంగా.. కూర్చుని లేవలేని పరిస్థితి ఉంటుంది. కీళ్ళు బిగుసుకుపోవటం వల్ల ఉదయం పూట మంచం దిగటం కూడా కష్టంగా మారుతుంది. వాతావరణాల్లో గాలి ఒత్తిడి మార్పులు ఈ నొప్పులను ట్రిగ్గర్‌ చేస్తాయి. శరీరం చుట్టుపక్కల గాలి ఒత్తిడి తక్కువగా ఉన్నప్పుడు కీళ్ళ చుట్టూరా కండరాలు, కండర బంధనాలు, ఇతర కణజాలాలు ఎక్స్‌ప్యాండ్‌ అవుతాయి. ఇది వీటి మీద ఒత్తిడిని పెంచుతుంది. ఆర్థరైటిస్ పేషెంట్స్‌, వృద్ధులు చలికాలంలో కీళ్ల నొప్పులు మరింత తీవ్రంగా ఉంటుంది. మందులు వాడడంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ శీతాకాలం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

హైడ్రేషన్

శీతాకాలంలో మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది చలిలో శరీరానికి అవసరమైనంత నీరు తాగరు. దీని కారణంగా మీరు కీళ్ళల్లో నొప్పి, కండరాలలో తిమ్మిరి సమస్యలు తలెత్తుతాయి. ఇందుకోసం తగిన స్థాయిలో నీళ్ళు తాగాలి. అదేవిధంగా కొన్ని పండ్ల రసాలు తీసుకుంటే కీళ్ళు, కండరాల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

పోషకాహారం

చలికాలంలో వృద్ధులకు లేదా యువకులకు పాదాలు, చేతుల్లో నొప్పి నిరంతరంగా ఉంటుంది. ఇలాంటి వారు బలమైన పోషకాహారం తీసుకోవాలి. విటమిన్ సి, డి, కె అధికంగా ఉండే ఆహార పదార్థాలను మెనూలో బాగా చేర్చుకోవాలి.

ఎముకలకు మేలు చేసేలా..

ఆహారంలో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం పాలకూర, క్యాబేజీ, టమోటాలు, నారింజలను ఎక్కువగా తినండి. ఇది మీ ఎముకలకు కూడా చాలా మేలు చేస్తుంది.

ఫిష్ లేదా సోయాబీన్స్:

సాల్మన్‌, మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. కీళ్ళ నొప్పులతో బాధపడే వారు శీతాకాలం వారి డైట్‌లో ఫ్యాటీ ఫిష్ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అదే వెజిటేరియన్ తినే వాళ్ళు అయితే సోయాబీన్స్ మంచి ఛాయిస్. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ తగ్గిస్తుంది. దీంతో, కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి శరీరంలో కాల్షియం శోషణను ప్రోత్సహిస్తుంది. దీని వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఆస్టియోపోరసిస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. శీతాకాలంలో మన ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా చేర్చుకుంటే.. కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి డయల్ డైసల్ఫైడ్ అనే సమ్మేళనం ఉంటుంది, దీనికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది శరీరంలో మంటతో పోరాడానికి సహాయపడుతుంది. నొప్పిని తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.

అల్లం:

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ళ నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. శీతాకాలం అల్లం మన డైట్‌లో తరచుగా తీసుకుంటే.. కీళ్ళ వాపు నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ నూనెలో ఒలియోకాథల్ ఉంటుంది. ఇది వాపు నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. వంటలో‌, సలాడ్ డ్రెస్సింగ్‌లో ఆలివ్‌ నూనె ఉపయోగించడం వల్ల వల్ల కీళ్ళ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే ఆవనూనెలో వెల్లుల్లి రెబ్బలను మరిగించి ఆ నూనెతో మసాజ్ చేసుకుంటే కూడా కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చును.

బనానా:

దాదాపు అన్నిచోట్లా లభించే అరటిపళ్ళలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాల నొప్పుల వల్ల కలిగే కండరాల నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలో పొటాషియం తక్కువగా ఉండటం వల్ల కండరాల బలహీనత, అలసట మరియు కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది.

ఎర్ర మిరపకాయలు:

ఎర్ర మిరపకాయల్లో అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.ఇది కండరాల నొప్పికి అద్భుతమైన నివారణ. ఇది కండరాల దృఢత్వం, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఎర్ర మిరప పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, అప్లై చేసి పల్చని బట్టతో కప్పి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం లేవగానే కడిగేయాలి. ఇలా వరుసగా రెండు మూడు రోజులు చేస్తే తేడా మీకే తెలుస్తుంది.