best places to visit at night In India, India, tourism, places, night time, visit
mictv telugu

రాత్రి వెలుగుల్లో మెరిసే అందాలు

December 27, 2022

best places to visit at night In India

ఇండియాలో చాలా టూరిస్ట్ స్పాట్ లు ఉన్నాయి. అసలు మనదేశంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడో స్పెషాలిటీ ఉంటుంది. ఢిల్లీ, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల గురించి అయితే చెప్పనే అక్కరలేదు. అడుగుఅడుగుకీ ఒక టూరిస్ట్ స్పాట్, ఒక చారిత్రక ప్రాధాన్య ప్రదేశం ఉంటూనే ఉంటాయి. అయితే కొన్ని ప్రదేశాలుంటాయి. అవి పగటి పూట కంటే రాత్రిపూట లైట్ల వెలుగుల్లో మరింత బావుంటాయి. కానీ అలాంటి ప్రదేశాలు మన భారత్ లో ఎక్కడున్నాయి. మనకన్నీ పగటి జిలుగులే కదా అనుకుంటున్నారా. ఉన్నాయి కానీ వాటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు అంతే.

ఇప్పడు చెప్పబోయే ప్రదేశాలు అందరికీ తెలిసివే. బాగా ప్రాచుర్యం పొందిన టూరిస్టులు ప్లేస్ లు కూడా. కానీ అవి రాత్రి వెలుగుల్లో మరింత బావుంటాయని చాలా కొద్ది మందికే తెలుసు. ందుకే అందరూ ఉదయం సమయాల్లో వాటిని చూసి వచ్చేస్తుంటారు.

మైసూర్ ప్యాలెస్:

మైసూర్ లో ఉండే ప్యాలెస్ గురించి తెలియనది ఎవరికి. ఇప్పటికీ అక్కడి రాజులు ఉండడం వల్ల దీనిని అత్యంత నీట్ గా మెయింటెయిన్ చేస్తుంటారు. దసరా టైమ్ లో అయితే దీన్ని మరింత అందంగా డెకరోటే చేస్తుంటారు కూడా. అయితే మామూలు సమయంలో కూడా మైసూర్ ప్యాలెస్ ను పగటి పూట కంటే రాత్రి పూట చూస్తే మరింత బావుంటుందిట. బయట ఉండే లైటింగ్ డెకొరేషనే కాదు లోపల ఉండే షాండ్లియర్ల వెలుగులు కూడా అద్భుతంగా ఉండి కళ్ళకు ఇంపుగా ఉంటుంది. ఇక్కడ రాత్రి ఏడు గంటకు జరిగే లైట్ షో కూడా అద్భుతంగా ఉంటుంది.

గోల్డెన్ టెంపుల్:

భారత్ లో సిక్కలు పవిత్ర స్థలం అనగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి ప్లేస్ అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్. బంగారుపూతతో మెరిసే ఈ దేవాలయం మామూలుగానే చూడముచ్చటగా ఉంటుంది. కానీ రాత్రిపూట, వేకువ జాయున ఇది మరింద బావుంటుంది అంటున్నారు. బంగారు రంగులో మెరిసే ఈ దేవాలయం లైట్ల వెలుగుల్లో మరింత మెరుస్తుంది. చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు అంటున్నారు చూసివచ్చిన టూరిస్టులు.

విక్టోరియా మెమోరియల్ :

కలకత్తాలో ఉందీ విక్టోరియా మెమోరియల్. ఇది చాలా పురాతన కట్టడం. మొత్తం తెలుపు రంగులో ఉండి చాలా బావుంటుంది. ఆ తెలుపుకు లైట్ల వెలుగులు యాడ్ అయితే దీని అందం మరింత రెట్టింపు అవుతుంది. తెలుపుకు వెలుగు తోడ్రై మరింత బ్రైట్నెస్ వచ్చి మిలమిలా మెరుస్తుందిట విక్టోరియా మెమోరియల్.

అంబర్ ఫోర్ట్:

 

జైపూర్ లో ఉందీ అంబర్ ఫోర్ట్. రాజ్ పుత్ ల వైభవం చూడాలంటే రాజస్థాన్, జైపూర్ లను చూడాల్సిందే. అక్కడి కోటలను సందర్శించాల్సిందే. జైపూర్ లో అంబర్ ఫోర్ట్ చాలా ఫేమస్. దీన్ని కూడా మొత్తం లైట్లతో డెకొరేట్ చేశారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 వరకు ఒక గంట విద్యుత్ దీపాల అలంకరణలో ఉంచుతారు. అప్పుడు మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు కూడా. కొంత సంధ్య వెలుగులు, దీపాల కాంతులలో అంబర్ ఫోర్ట్ వింత సోయగంతో అలరారుతుందని చెబుతున్నారు.

అక్షర్ ధామ్:

ఆర్కిటెక్చర్ కు ఫేమస్ అక్షర్ ధామ్ టెంపుల్స్. స్వామినారాయణ టెంపుల్స్ ఏ దేశంలో ఉన్నా ఒకేలా ఉంటాయి. చాలా గొప్ప ఆర్కిటెక్చర్ ని కలిగి ఉంటాయి. మన దేశంలో అత్యంత పెద్ద స్వామినారాయణ టెంపుల్ అక్షర్ ధామ్. ఢిల్లీలో ఉన్న ఈ టెంపుల్ పెద్ద తోటలతో, మంచి మంచి పెయింటింగ్స్ తో ఉంటుంది. రాత్రి తొమ్మిది వరకు ఇక్కడ సందర్శన చేయవచ్చును. ుదయం కంటే రాత్రిపూట మరింత అందంగా ఉంటుందీ టెంపుల్. అన్నింటికంటే ఇక్కడ జరిగే లైట్ షో అత్యంత ఆకర్షణీయంగా ఉంటంది. మ్యూజికల్ ఫౌంటెన్ విత్ లైట్స్ తో ఉండే ఈ షో గంటపాటూ నడుస్తుంది. చూస్తున్నంతసేపూ ఏదో లోకాల్లో తేలుతాం.

జేసల్మర్ కోట:

రాజస్థాన్ లో మరో రాజ్ పుత్ కోట ఇది. చాలా పెద్ద కోట కూడా ఇది. ఎత్తైన ప్రహారీ గోడ కలిగి ఉండే ఈ కోట రాత్రి లైట్లలో మరింత బావుంటుంది. ఎక్కువ మంది పర్యాటకులు రాత్రిపూట కూడా ఈ కోటను చూడ్డానికి వస్తుంటారు.

హుస్సేన్ సాగర్:

హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెలియని వారు ఎవరుంటారు. అందులోనూ ముఖ్యంగా తెలుగు వాళ్ళు. హుస్సేన్ సాగర్, అందులో మధ్యలో ఉండే బుద్ధ విగ్రహం ఏళ్ళు అయినా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో డౌటే లేదు. అయితే ఇది ఉదయం పూట చూడ్డం కన్నా రాత్రి పూట బోట్ లో అక్కడి వరకు వెళ్ళి రంగురంగుల లైట్ల మధ్య చూస్తే వచ్చే మజానే వేరు. అంత పెద్ద చెరువు మధ్యలో , చల్లటి గాలిలో….లైట్ల మధ్య బుద్ధుడితో కొంత సమయం గడపడం…అదొక వింతైన అనుభవం, ఎవ్వరూ మిస్ కాకూడని ఆనందం.

వివేకనంద రాక్ మెమోరియల్:

దేశానికి ఈ చివరనున్న ఈ ఎట్రాక్షన్ కన్యాకుమారిలో ఉంది. ఇక్కడ సూర్యోదయ, సూర్యాస్తమయాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే రాత్రి వేళ్ళల్లో కూడా ఈ రాక్ మెమోరియల్ చూడ్డానికి అద్భుతంగా ఉంటుందిట.