Bettings On Munugode ByPoll
mictv telugu

October 26, 2022

మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. గెలుపు గుర్రాలపై కోట్లలో పందాలు కాస్తున్నారు. లోకల్ నుంచి ఏపీదాకా బెట్టింగుల జోరు కొనసాగుతోంది.

కాయ్ రాజా కాయ్

మునుగోడులో హోరాహోరీగా ప్రచారం కొనసాగుతోంది. పార్టీలు ఓట్లవేటలో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలుపుకోసం సెగ్మెంట్‌ని ఇటు నోట్లు అటు మత్తులో ముంచెత్తున్నాయి. పోటీపడి దావత్ లు ఇస్తున్నాయి. సభలు, సమావేశాలకు పిలిచి మర్యాద చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతిఓటర్‌ని కలుస్తున్నారు. ఊరూరా మూడుపార్టీల నేతల సందడి కనిపిస్తోంది. గల్లీగల్లీలో ఢిల్లీ స్థాయి నేతలు తిరుగుతున్నారు. గెలుపు పై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీదే విజయమని కొందరు..లేదు టీఆర్ఎస్ దే గెలుపు అని మరికొందరు లోకల్లో పందాలు కాస్తున్నారు. వేల నుంచి మొదలకొని లక్షల దాకా బెట్టింగ్‌లు పెడుతున్నారు.

సర్వే చేసి మరీ…

మునుగోడులో రోజురోజుకు పరిస్థితి మారుతోంది. పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. లోకల్ లీడర్లని తమవైపు తిప్పుకుంటున్నాయి. రోజుకో కండువా పూటకో పార్టీలో వుంటున్నారు. అందుకే స్థానికంగా అంచనాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. దీంతో పందెంరాయుళ్లు గ్రౌండ్ లెవల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ సిచ్యూయేషన్ పై పక్కాగా అంచనా వేస్తున్నారు. లక్షల నుంచి కోట్ట రూపాయలదాకా బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు.

ఏపీలోనూ బెట్టింగ్‌లు

మునుగోడుపై తెలంగాణలోనే కాదు ఏపీలో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. గెలుపు పై ఎవరికివారే అంచనాలు వేసుకుంటున్నారు. కొందరు ఫోన్లు చేసి మునుగోడులో పరిస్థితుల్ని తెలుసుకుంటున్నారు.పందెం రాయుళ్లు వీరి కన్నా వంద అడుగులు ముందే వున్నారు. గ్రౌండ్ లెవల్లో సర్వే ఫలితాల్ని బట్టి బెట్టింగ్‌లకు దిగుతున్నారు. లక్ష నుంచి కోట్ల రూపాయలదాకా డబ్బులు పెడుతున్నారు.

మునుగోడు ఇప్పుడెలా ఉందంటే

మునుగోడులో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. క్యాంపెయిన్ కాకతో రణగోడు రగిలిపోతోంది. నేతల మాటలమంటలతో వార్ రసవత్తరంగా సాగుతోంది. పోలింగ్‌కు మిగిలింది వారమే.సో పార్టీలు చివరి అస్త్రాల్ని ప్రయోగిస్తున్నాయి. బ్రహ్మాస్త్రాన్ని ఒకటిరెండు రోజుల్లో బయటకు తీసే అవకాశం వుంది. దీంతో బెట్టింగ్‌ల హోరు మరింత జోరందుకోనుంది.