మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించి తోకముడిచి వెళ్లిపోయిన కరోనా మళ్లీ రెచ్చిపోతోంది. చైనాలో కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మరో కొత్త ముప్పు వచ్చిపడింది. మనదేశంలోకి తొలిసారిగా బీఫ్ 7 కరోనా వేరియంట్ అడుగుపెట్టింది. ప్రస్తుతానికి ఏడు కేసులు నమోదైనట్లు గుర్తించినా ఇటీవల ముగిసిన పండగల సీజన్లో దీనితోపాటు ఇతర వేరియంట్లు బాగానే పాకి ఉంటాయని ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరలో రానున్న క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తగా ఉండకపోతే కరోనా చరిత్ర పునరావృతమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బీఫ్ 7 వేరియంట్‌ను సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
బీఎఫ్ 7 వేరియంట్ లక్షణాలు..
ఇది ఒమిక్రాన్ అనే వేరియంట్లో సబ్ వేరియంట్
ఎడతెగని దగ్గు, ఛాతీ నొప్పి
వాసన కోల్పోవడం, వినికిడి కోల్పోవడం
శరీరం వణకడం, నీరసం
ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువ, అంటే రోగనిరోధక శక్తి బాగా తగ్గుతుంది
ఇతర వ్యాధులు ఉన్నవారికి ముప్పు కాస్త ఎక్కువ
జాగ్రత్తలు
కరోనా టీకా ఇంకా వేయించుకోని వారు వెంటనే వేయించుకోవాలి.
మాస్కులు ధరిస్తూ, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలి.
వేరియంట్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకుని, వైద్యులను సంప్రదించాలి.
కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయితే వైద్యులు సూచించిన మందులు వాడాలి
జనం కిక్కిరిసిన వేడుకలకు దూరంగా ఉంటే మేలు