bgauss d15 new electric scooter launched with 20 safety features
mictv telugu

మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

February 20, 2023

bgauss d15 new electric scooter launched with 20 safety features

మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చేసింది. ఇంతకు ముందు వాటికి లేని ప్రత్యేకతలతో, మరింత సేప్టీ మెజరమెంట్స్ తో ఈ స్కూటర్ ను తీసుకొచ్చింది బిగాస్ కంపెనీ. హై బ్యాటరీ రేంజ్ తో పాటూ యాక్సిలరేషన్తో బిగాస్ డి 15 ను తీసుకొచ్చామని చెబుతోంది కంపెనీ. అంతేకాదు ఈ స్కూటర్ సామాన్యుడికి అందుబాటు ధరలోనే ఉంటుంది అని చెబుతున్నారు. బుకింగ్స్ ప్రారంభ అయ్యాయి.

బిగాస్ కంపెనీ ఇంతకు ముందే రెండు వెర్షన్లను పార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పడు మూడో వెర్షన్ ను మార్కెట్లోకి వదిలింది. బిగాస్ డిఐ ధర 99 వేల 999 కాగా, బిగాస్ డి15 ప్రో ధర మాత్రం 1 లక్షా 14 వేల 999 రూపాయలు. అయితే బుక్ చేసుకునే వాళ్ళఉ కేవలం 499 రూపాయలు మాత్రం చెల్లిస్తే సరిపోతుందని కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో పెట్టింది.

ప్రత్యేకతలు:

3.2 కిలోవాట్స్ సామర్థ్యంతో లిథియం అయాన్ బ్యాటరీ, 5:30 గంటలలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 115 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

కేవలం 7 సెకన్లలోనే 0 నుంచి 60 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది.

ముందు, వెనక డ్రమ్ బ్రేక్ లకు కాంబి బ్రేకింగ్ సిస్టంను జోడించింది. స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనకవైపు షాక్ అబ్జార్బర్ సిస్టంతో సస్పెన్షన్ వ్యవస్థ ఉంది.

యాంటీ థెఫ్ట్ అలారం, ఐపీ67 రేటెడ్ ఎలక్ట్రిక్ మోటార్, స్మార్ట్ బ్యాటరీ, మోటార్ కంట్రోలర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.