మనదేశంలో రెండు పెళ్లిళ్లు చట్ట విరుద్ధం. కొందరి విషయంలో ఇది కేవలం చట్టాలకే పరిమితం. చాలామంది సెలబ్రిటీలే కాదు, సామాన్యులు సైతం ఇద్దరు భార్యలతో ఎంచక్కా కాపురాలు చేసుకుంటున్నారు. ఇద్దరు భర్తలతో కాపురం చేసే భార్యలు చాలా చాలా అరుదు. భార్యాలిద్దరి మధ్య సమరస్యం, సఖ్యత, సహనం ఉంటే మగానుభావులు ఏ సమస్యా లేకుండా జీవితరథ చక్రాలను దొర్లిస్తుంటారు. అయితే ఎవరో ఒకరు తిరగబడితే మాత్రం శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లక తప్పందు. ఇక్కడ ఒకడి జీవితాన్ని ఎంతమంది పంచుకుంటున్నారన్నాది ముఖ్యం కాదు, ఎంత సఖ్యంగా ఉంటున్నారన్నదే ముఖ్యం.
దీని వల్ల చాలా ఘోరాలు, నేరాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. విషయంలోకి వస్తే ఓ పురుష పుంగవుడు ఒకే ముహూర్తంలో ఇద్దరు యువతులను ఎంచక్కా పెళ్లాడారు. అదీ అందరి సమక్షంలో, సన్నాయి మేళం, వేద మంత్రోచ్చారణ మధ్య తాళికట్టేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పైగా ఇది ఆ వధువులు, వరుడి తెగ సంప్రదాయం కూడా కావడంతో పెద్దలు కూడా గుండెబరువు చేసుకుని పెద్ద మనసుతో ఆశీర్వదించారు.
డిగ్రీ డ్రాపౌట్ అయిన సత్తిబాబు అనే యువకుడు ఇద్దరు యువతుల్ని ప్రేమించాడు. వాళ్లు కూడా అతణ్ని ప్రేమించారు. వాళ్ల ఆచారం ప్రకారం పెళ్లికి ముందు సహజీవనం తప్పుకాదు. కొన్నాళ్లు కలసి జీవించాక ఇష్టమైతే పెళ్లాడతారు. పిల్లలు పుట్టినా కూడా సమస్య ఉండదు. సత్తిబాబు ఇంటర్లో ఉన్నప్పుడు సహ విద్యార్థిని స్వప్నకుమారిని ప్రేమించాడు. అదే సమయంలో మరదలు సునీతకు కూడా మనసిచ్చాడు. మూడేళ్లుగా ఇద్దరితో కలసి ఉంటుందన్నారు.
స్వప్నకుమారి ఒక కూతురు, సునీతకు ఒక కొడుకు పుట్టాడు. భార్యలిద్దరూ ఇప్పుడు మళ్లీ గర్భిణులు. అయితే యువతులు తల్లిదండ్రులు రంగంలోకి దూకారు. ఇలా ఎన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా వుంటారని నిలదీశారు. దీంతో సత్తిబాబు అసలు విషయం చెప్పి ఇద్దర్నీ పెళ్లాడతానన్నారు. పెద్దలు తల పట్టుకన్నారు. సహజీవనం తప్పుకాకపోయినా ఇద్దర్నీకట్టుకోవడం సరికాదని, పిల్ల సంతను ఎలా పోషిస్తావని మందలిచ్చారు. అయినా సత్తిబాబు వెనక్కి తగ్గలేదు. స్వప్న, సునీత కూడా రాజీకి వచ్చారు. దీంతో చేసేదేమీ లేకు ముగ్గురీకి ఒకే సుముహూర్తంలో పెళ్లి చేశారు.