భగత్సింగ్‌ను దాచిన వీరుడి కన్నుమూత.. జోహార్ నసీం! - MicTv.in - Telugu News
mictv telugu

భగత్సింగ్‌ను దాచిన వీరుడి కన్నుమూత.. జోహార్ నసీం!

April 12, 2018

స్వాతంత్ర సమరసింహం భగత్ సింగ్ సహచరుడు నసీం మీర్జా చంగేజీ ఇక లేరు. 107 ఏళ్ల నసీం ఈ రోజు సాయంత్రం పాత ఢిల్లీలోని పహారీ ఇమ్లీలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కుమారుడు సికందర్ బేగే ఈ విషయాన్ని వెల్లడించారు. పాత ఢిల్లీకి చెందిన ససీం ఓ కాంగ్రెస్ నేత సలహాపై 1929లో భగత్‌ను కలిశారు. పార్లమెంటులో బాంబు దాడి గురించి భగత్ అతనికి వివరించాడు. తాను తలదాచుకోవడానికి ఒక సురక్షిత స్థావరం చూపమని కోరాడు. తర్వాత నసీం ఢిల్లీలో భగత్‌ను ఒక రహస్య స్థావరంలో దాచిపెట్టాడు. బాంబుదాడి తర్వాత తను కూడా గ్వాలియర్‌కు పారిపోయాడు. భగత్‌తో తన సాన్నిహిత్యం గురించి నసీం సాధికారికంగా వివరించేవాడు. చాలామంది చరిత్రకారులు కూడా దీన్ని ధ్రువీకరించారు.

రెండు ప్రపంచ యుద్ధాలు, జలియన్ వాలాబాగ్ మారణకాండ, ఉప్పు సత్యాగ్రహం, స్వతంత్ర్యం, దేశవిభజన, పాక్, చైనాలతో యుద్ధాలు, ఎమర్జెన్సీ వంటి ఎన్నో చారిత్రక ఘట్టాకు నసీం సాక్షి. ఆయనను లివింగ్ ఎన్ సైక్లోపీడియా అని అంటారు. నసీం చెంగిజ్ ఖాన్ వంశస్తుండని చెబుతారు. నసీంకు ఏడుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. ఆయన అంత్యక్రియలన రేపు నిర్వహిస్తారు.