Bhaggumanna gold and silver price..in one day..
mictv telugu

భగ్గుమన్న బంగారం, వెండి ధర..ఒక్కరోజులోనే..

August 4, 2022

భారతదేశంలో బంగారం, వెండి కొనాలని ఆశగా ఎదురుచూస్తున్న వారికి యాజమాన్యాలు ఓ షాకింగ్ విషయాన్ని తెలియజేశాయి. బంగారం, వెండి ధరలు గురువారం ఒక్కరోజే భారీగా పెరిగాయని పేర్కొన్నాయి. 10 గ్రాముల బంగారం ధరపై దాదాపు రూ. 800 మేర పెరిగిందని, దాంతో బంగారం ధర ఏకంగా రూ.52,200 స్థాయికి చేరుకుందని తెలియజేశాయి. ఈ నెలలో ఒకేరోజు ఇంత ధర పెరగటం బంగారం ప్రియులకు భారంగా మారిందని వివరించారు.

అంతేకాదు, బంగారంతోపాటు వెండి ధరలు కూడా పైపైకి ఎగిశాయని, కేజీ వెండి ధర 1.2 శాతం పెరిగి రూ.58,250గా నమోదైందని ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే, ఈ ధరలు గ్లోబల్ మార్కెట్లో కూడా ఔన్స్ 0.7 శాతం పెరిగి 1,777.91 డాలర్ల వద్దకు చేరుకున్నట్లు తెలిపారు. అమెరికా డాలర్, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ వెనక్కి తగ్గడంతో.. బంగారం రయ్‌మని ఎగిసిందని, శుక్రవారం విడుదల కానున్న అమెరికా జాబ్స్ డేటాపై గోల్డ్ ట్రేడర్లు ఎక్కువగా ఫోకస్ చేశాయని తెలిపాయి.

అయితే, నేడు ధరలు పెరగడంతో రెండు నెలల కనిష్ట స్థాయిల నుంచి బంగారం ధరలు భారత్‌లో కోలుకున్నాయి. జూలై నెలలో బంగారం ధరలు కనిష్ట స్థాయిలకి పడిపోయిన సంగతి తెలిసిందే. ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను చాలా భారీగా పెంచుతుందనే సంకేతాలతో.. బులియన్ అవుట్‌లుక్ దెబ్బతింది. దీంతో ధరలు తగ్గాయి. కానీ తాజాగా అమెరికా ఫెడరల్ రిజర్వు తన కఠితనమైన వడ్డీ రేట్ల విధానాన్ని కాస్త సడలించనున్నట్టు తెలిపింది.