‘ప్రేమ పావురాలు’ హీరోయిన్‌కు విడాకులు ఇప్పించిన మీడియా  - MicTv.in - Telugu News
mictv telugu

‘ప్రేమ పావురాలు’ హీరోయిన్‌కు విడాకులు ఇప్పించిన మీడియా 

February 28, 2020

kjbcdg

సినీతారల పెళ్లిప్రమాణాలకు బలం లేదని అంటారు. చాలామంది నటీనటులు విడాకులు తీసుకోవడమే దీనికి కారణం. బాలీవుడ్‌లో ఈ కేసులు మరీ ఎక్కువ. కొందరు పెళ్లయిన రెండుమూడేళ్లకు పెటాకులు చేసుకుంటే, కొందరు దశాబ్దాల దాంపత్య బంధాన్ని క్షణంలో తెగతెంపులు చేసుకుంటారు. ఇవన్న ఒక ఎత్తయితే సినీతారలు వాళ్లు కోరుకోకున్నా మీడియా వారికి విడాకులు ఇప్పించాలని ఉవ్విళ్లూరుతుంటుంది. తాజాగా ‘మైనే ప్యార్ కియా’(ప్రేమ పావురాలు) హీరోయిన్ భాగ్యశ్రీ పెళ్లిని కూడా మీడియా పెటాకులు చేసింది. ఆమె విడాకులు తీసుకున్నారని ప్రచారం చేస్తోంది! 

తన భర్త హిమాయలకు ఒక దశలో ఏడాదిన్నరపాటు దూరంగా ఉండాల్సి వచ్చిందని, దాన్ని తలచుకుంటే ఇప్పటికీ భయంగా ఉంటుందని ఆమె చెప్పిన మాటను పట్టకుని విడాకులు కథను అల్లేశారు. నిజానికి ఆమె ఏం చెప్పిందటే.. ‘నేను తొలిసారి ప్రేమలో పడింది హిమాలయతోనే. అతణ్నే పెళ్లి చేసుకున్నాను. కానీ మేం ఏడాదిన్నరపాటు విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతో కుంగిపోయాను. అతణ్నకాకుండా వేరే వ్యక్తిని చేసుకుని ఉంటే ఎలా ఉండేదో తలచుకుంటే భయంగా ఉంటుంది..’ అని ఆమె చెప్పింది. దీన్ని పట్టుకుని ఆమె ఇప్పటికే విడిపోయిందని వార్తలు వండివారుస్తున్నారు.

ప్రేమపావురాలు చిత్రంతో భాగ్యశ్రీ 1990 దశకంలో దేశంలోని కుర్రాళ్లకు ఆరాధ్య దేవతగా మారిపోయింది. కెరీర్ ప్రారంభంలోనే ఆమె తన స్నేహితుడైన హిమాలయను పెళ్లాడింది. చాలా మంది వద్దని వారించినా వినలేదు. భాగ్యశ్రీ టాలీవుడ్‌లో బాలయ్య సరసన ‘యువరత్న రాణా’ చిత్రంలో నటించినా తెలుగు జనం మెచ్చలేకపోయారు. ప్రస్తుతం ఆమె రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. భాగ్యశ్రీ కొడుకు అభిమన్యు గత ఏడాదే ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ చిత్రంతో నటుడిగా మారాడు.