భైంసాలో ఎంఐఎం జెండా.. టీఆర్ఎస్‌కు ఒక్కటీ దక్కలేదు..   - MicTv.in - Telugu News
mictv telugu

భైంసాలో ఎంఐఎం జెండా.. టీఆర్ఎస్‌కు ఒక్కటీ దక్కలేదు..  

January 25, 2020

Bhainsa.

హైదరాబాద్ నగరానికే పరిమితమైన మజ్లిస్ పార్టీ మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటింది. నిర్మల్ జిల్లా  భైంసా స్థానం ఎంఐఎం ఖాతాలో పడిపోయింది. మునిసిపల్ ఎన్నికల్లో మొత్తం 26 వార్డులకు గాను ఎంఐఎంకు 15, బీజేపీకి 9, ఇతరులకు దక్కాయి. ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌లో తొలుత బీజేపీ గెలుస్తుందని భావించినా చివరికి వచ్చేసరికి ఒవైసీల పార్టీ ఆధిక్యం కనబరిచింది. భైంసాలో ఇటీవల రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తడం, పోలీసులు కర్ఫ్యూ విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన మునిసిపల్ ఎన్నికలను ఎంఐఎం, బీజేపీలు సవాలుగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్‌కు, విపక్ష కాంగ్రెస్‌కు ఒక్క వార్డూ దక్కలేదు.  

ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జాబిర్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. మునిసిపాలిటీలోని అన్ని వార్డులనూ సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.