భజరంగ్ దళ్ కార్యకర్త హత్య.. భగ్గుమంటున్న కర్ణాటక - MicTv.in - Telugu News
mictv telugu

భజరంగ్ దళ్ కార్యకర్త హత్య.. భగ్గుమంటున్న కర్ణాటక

February 21, 2022

 

resVE

 

కర్ణాట‌క‌ రాష్ట్రంలో వ‌రుస‌గా ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవలే హిజాబ్ వివాదం రాష్ట్రంలో తీవ్రస్ధాయిలో ఉద్రిక్తలకు దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త హ‌త్య మ‌రోమారు ఉద్రిక్త‌తల‌ను రాజేసింది. క‌ర్ణాట‌కలోని శివ‌మొగ్గ‌లో ఆదివారం రాత్రి భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త హ‌ర్ష‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేశారు. దీంతో భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్యక‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు. శివ‌మొగ్గ స‌హా ప‌లు ప్రాంతాల్లో సోమ‌వారం ఉద‌యం నుంచే ఆందోళ‌న‌ల‌కు దిగారు. ఈ ఆందోళ‌న‌ల్లో ప‌లు వాహనాలను కాల్చి వేశారు. ప‌లు ప్రాంతాల్లో రాళ్లు రువ్వారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళ‌న‌లు చేస్తున్న ప్ర‌దేశాల్లో ఆంక్ష‌లు విధించారు.

మరోపక్క హిజాబ్ వివాదంతో హ‌ర్ష హ‌త్య‌కు ఎలాంటి సంబంధం లేద‌ని క‌ర్ణాట‌క హోం శాఖ మంత్రి ప్ర‌క‌టించారు. “హ‌ర్షపై కొంద‌రు గుర్తు తెలియని వ్య‌క్తులు క‌త్తుల‌తో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో హ‌ర్ష అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడ‌ు. ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే విచార‌ణ‌కు ఆదేశించాం. అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు” అని ఆయన తెలిపారు. కావున సోష‌ల్ మీడియాలో క‌నిపించే అస‌త్య పోస్టుల‌ను న‌మ్మొద్ద‌ని, ప్ర‌జ‌లంతా సంయ‌మ‌నం పాటించాల‌ని మంత్రి కోరారు.