రేపు విడుదల, ఈ రోజు పేరు మార్పు..భానుమతి అండ్ రామకృష్ణ - MicTv.in - Telugu News
mictv telugu

రేపు విడుదల, ఈ రోజు పేరు మార్పు..భానుమతి అండ్ రామకృష్ణ

July 2, 2020

vb bbng

కొన్ని సినిమాల పేర్లు రాత్రికి రాత్రే మారిపోతుంటాయి. అందుకు చక్కటి ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘గద్దలకొండ గణేష్’. తొలుత ఈ మూవీ టైటిల్ ను దర్శకనిర్మాతలు ‘వాల్మీకి’ అని పెట్టారు. కానీ, ఆ టైటిల్ విషయంలో వివాదం తలెత్తడంతో ‘గద్దలకొండ గణేష్’ గా మార్చారు. తాజాగా ‘భానుమతి రామకృష్ణ’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది.

నవీన్ చంద్ర, సలోనీ లూత్ర హీరో హీరోయిన్లుగా నటిసున్న ఈ సినిమాకు శ్రీకాంత్ నాగోటి దర్శకుడు. ఈ సినిమాను నేరుగా ‘ఆహా’ ఓటీటీ యాప్ లో రేపు విడుదల చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం విడుదల సన్నాహాలలో వుండగా, ప్రముఖ నటి దివంగత భానుమతి తనయుడు మద్రాస్ హైకోర్టులో ఈ చిత్రం టైటిల్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశాడు. భానుమతీ రామకృష్ణగా ప్రసిద్ధురాలైన తన తల్లి పేరును ఈ టైటిల్ స్పురింపజేస్తోందనీ, తమ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా దీనికి ఈ టైటిల్ నిర్ణయించారనీ ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. దీంతో టైటిల్ మార్చమంటూ హైకోర్టు చిత్ర నిర్మాతకు ఆదేశాలు ఇవ్వడంతో, ఈ టైటిల్ని ‘భానుమతి అండ్ రామకృష్ణ’గా స్వల్పంగా మార్చినట్టు సమాచారం. అలాగే ఈ సినిమా ట్రైలర్ ను నటుడు నాని ఈరోజు సాయంత్రం విడుదల చేశారు.