ప్రముఖ నటి భానుప్రియ మాజీ భర్త ఆదర్శ్ ఆకస్మిక గుండెపోటుతో చనిపోయారు. ఆయన గత నెల 20న మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదర్శ్ వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. భానుప్రియ ఆయనను 1998లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అభినయ అనే కూతురు ఉంది.తర్వాత విభేదాలతో ఈ జంట 2005లో విడిపోయి అమెరికా నుంచి భారత్ కు వచ్చేసింది. ఆదర్శ్ మరణ వార్త తెలియడంతో ఆమె హుటాహుటిన లాస్ ఏంజెలిస్కు వెళ్లిపోయారు. చాన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ పెద్దకళ్ల నటి తన కూతురితో ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు.