థ్యాంక్యూ కేటీఆర్.. ఇట్లు భరత్ అనే నేను - MicTv.in - Telugu News
mictv telugu

థ్యాంక్యూ కేటీఆర్.. ఇట్లు భరత్ అనే నేను

April 25, 2018

మహేశ్ బాబు తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ సినిమాకు ప్రేక్షకుల నుంచి చక్కని ఆదరణ లభిస్తోంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాను చాలామంది రాజకీయ నాయకులు చూస్తున్నారు. తాజాగా తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా చూశారు. అందుకు మూవీ టీమ్ థ్యాంక్స్ చెప్పింది. కేటీఆర్ ఈ సినిమా చూడ్డమే కాకుండా, విజయోత్సవ కార్యక్రమానికి హాజరైనందుకు సంతోషంగా ఉందని పేర్కొంది.